7, సెప్టెంబర్ 2011, బుధవారం

తరంగిణి....

ఏదో పెదాల వీణను,
చిరునవ్వుల హస్తాలు మీటిన శబ్ధమస్తే,
చూసాను అటువైపు,
తనే పున్నమి వెన్నెలల,

చిరునవ్వుల్ని మార్గామన్తటా పరుచుకుంటూ మందగామినిల సాగుతుంది......
క్షణాల పువ్వుల్ని,
తన స్పర్శతో పూయిన్చుకుంటూ,
కాల కవితను వాటితో అలంకరించుకుంటూ,
ఎన్నో చూపుల అలలు చేరే తీరమై,
రూపంపోసుకున్న ఓ అందమైన భావమై,
మెరుపు తీగల కదులుతుంది......


భూమిపై  ఉరుములు నడుస్తున్నట్టు,
కాలి గజ్జెల ధ్వని వినిపిస్తే,
చూసాను అటువైపు,
తనే ప్రకృతంతా మాటల ఢమరూకాల్ని మోగించుకుంటూ,
తరంగిణిల తరలిపోతున్తుది...
గుండె నిండ,
 పలకరింపుల అరుణ తారల్ని మెరిపించి,
తను చూస్తె ఎన్నో మనసులు ,
సుడిగుండంలో పడి అల్లాడుతాయి...
తను పలకరిస్తే ఎన్నో ఆశలు,
ఆనందంతో తల్లడిల్లుతాయి...
తను ఎందరి మదిలో దేవత,
నన్ను తప్ప ఎవ్వరిని కరుణించని మాలెత...

5, సెప్టెంబర్ 2011, సోమవారం

నా పల్లె.....


అడుగుపెడుతుంటే,
అనురాగ హిమమును కురిపించి స్వాగతించేది,
పలకరింపుల పరిమళాలు పూసి,
మనసంతా ఆనందాన్ని నింపేది,
బంధాల పూలమాలలు వేసి,
మాటల అక్షింతలు జల్లి,
బాగోగుల హారతులిచ్చేది నా పల్లె.....
కోయిలల రాగాలతో,
పక్షుల కిల కిల ధ్వనులతో,
పంటచేనుల నాట్యాలతో,
తీరొక్క పూల అలంకరణతో,
విరాజిల్లేది నా పల్లె...
పండుగ నాటి ఆడపడుచుల,
పెళ్ళికూతురుల ముస్తాబయ్యేది నా పల్లె....
ప్రబంధాలలోని వర్ణనలు,
కావ్యాలలోని వివరణలు,
నా పల్లెని చూసే మలచబడ్డాయి....
ఎందఱో రాజులు నా పల్లె కోసం యుద్ధాలుచేసారు..
సంబంధాల సిరులకోసం,
ఆప్యాయతల హృదయాల కోసం....
పల్లెలో ప్రతి ఒక్కరి పెదాలపై,
చిరునవ్వు లాస్యమాడుతూ ఉండేది..
ప్రతి ఒక్కరి ఇంటిలో,
దేవతలు సేదతిరుతూ ఉండేవారు..
ఏ కుబేరుడు,
మా పల్లె ప్రజలంతా ధనవంతుడు,
ఆత్మీయతలొ..
ఏ ఇంద్రుడు,
మా పల్లె ప్రజలంతా అదృష్టవంతుడు,
స హృదయతలో..
నా పల్లె
విరచిస్తే ఒక కావ్యం..
పాడితే ఒక సాటిలేని గానం..

అలాంటి నా పల్లె ఇప్పుడు.....
వెళ్తే మౌనాల మల్లెలు చల్లుతుంది,
కన్నీల్లతొ కాళ్ళు కడుగుతుంది..
పగిలిన నాలుకలా,
నీటికై తపిస్తూ,
వలస పాదాలతో పరుగులు తీస్తుంటుంది..
మాడిన డొక్కలా,
ఆహారానికి అన్వేషిస్తూ,
ఆశల రెక్కలతో,
కష్టాల వీధుల్లో విహరిస్తుంటుంది.
నిరీక్షిస్తున్ననయనాల్లా
చెదిరిన స్వప్నాలతో,
నిషా వస్త్రాలతో,
అందని ఆనందాలకోసం,
గాయాల గుండెగా ప్రయానిస్తుంటుంది.
బీడుగా మారిన వర్తమానంతో,

జ్ఞాపకాలుగా మారిన గతాన్ని గుండెల్లో నింపుకొని,
అగమ్యమైన మార్గాలవెంబడి,
నిర్దిష్టం లేని భవితవ్యం కోసం,
కాల సంద్రంలో,
క్షణాల తెప్పపై ఈదుతూ ఉంటుంది.
సేద తీర్చే నీడ కోసం,
మెతుకునిచ్చే జాడ కోసం....
కరువు శత్రువు,
నా పల్లెను తాళాల సంకెళ్ళతో బంధించాడు..
బంధీ అయిన,
ఆనందాలు,
ఆప్యాయతలు,
విముక్తి చేసే మనిషి కోసం తల్లడిల్లుతున్నాయి..


ఇప్పుడు నా పల్లె,
మూగబోయిన తల్లి,
అనాధైన చెల్లి,
పరిమళాలు లేని జాజిమల్లి.......