7, సెప్టెంబర్ 2011, బుధవారం

తరంగిణి....

ఏదో పెదాల వీణను,
చిరునవ్వుల హస్తాలు మీటిన శబ్ధమస్తే,
చూసాను అటువైపు,
తనే పున్నమి వెన్నెలల,

చిరునవ్వుల్ని మార్గామన్తటా పరుచుకుంటూ మందగామినిల సాగుతుంది......
క్షణాల పువ్వుల్ని,
తన స్పర్శతో పూయిన్చుకుంటూ,
కాల కవితను వాటితో అలంకరించుకుంటూ,
ఎన్నో చూపుల అలలు చేరే తీరమై,
రూపంపోసుకున్న ఓ అందమైన భావమై,
మెరుపు తీగల కదులుతుంది......


భూమిపై  ఉరుములు నడుస్తున్నట్టు,
కాలి గజ్జెల ధ్వని వినిపిస్తే,
చూసాను అటువైపు,
తనే ప్రకృతంతా మాటల ఢమరూకాల్ని మోగించుకుంటూ,
తరంగిణిల తరలిపోతున్తుది...
గుండె నిండ,
 పలకరింపుల అరుణ తారల్ని మెరిపించి,
తను చూస్తె ఎన్నో మనసులు ,
సుడిగుండంలో పడి అల్లాడుతాయి...
తను పలకరిస్తే ఎన్నో ఆశలు,
ఆనందంతో తల్లడిల్లుతాయి...
తను ఎందరి మదిలో దేవత,
నన్ను తప్ప ఎవ్వరిని కరుణించని మాలెత...

5, సెప్టెంబర్ 2011, సోమవారం

నా పల్లె.....


అడుగుపెడుతుంటే,
అనురాగ హిమమును కురిపించి స్వాగతించేది,
పలకరింపుల పరిమళాలు పూసి,
మనసంతా ఆనందాన్ని నింపేది,
బంధాల పూలమాలలు వేసి,
మాటల అక్షింతలు జల్లి,
బాగోగుల హారతులిచ్చేది నా పల్లె.....
కోయిలల రాగాలతో,
పక్షుల కిల కిల ధ్వనులతో,
పంటచేనుల నాట్యాలతో,
తీరొక్క పూల అలంకరణతో,
విరాజిల్లేది నా పల్లె...
పండుగ నాటి ఆడపడుచుల,
పెళ్ళికూతురుల ముస్తాబయ్యేది నా పల్లె....
ప్రబంధాలలోని వర్ణనలు,
కావ్యాలలోని వివరణలు,
నా పల్లెని చూసే మలచబడ్డాయి....
ఎందఱో రాజులు నా పల్లె కోసం యుద్ధాలుచేసారు..
సంబంధాల సిరులకోసం,
ఆప్యాయతల హృదయాల కోసం....
పల్లెలో ప్రతి ఒక్కరి పెదాలపై,
చిరునవ్వు లాస్యమాడుతూ ఉండేది..
ప్రతి ఒక్కరి ఇంటిలో,
దేవతలు సేదతిరుతూ ఉండేవారు..
ఏ కుబేరుడు,
మా పల్లె ప్రజలంతా ధనవంతుడు,
ఆత్మీయతలొ..
ఏ ఇంద్రుడు,
మా పల్లె ప్రజలంతా అదృష్టవంతుడు,
స హృదయతలో..
నా పల్లె
విరచిస్తే ఒక కావ్యం..
పాడితే ఒక సాటిలేని గానం..

అలాంటి నా పల్లె ఇప్పుడు.....
వెళ్తే మౌనాల మల్లెలు చల్లుతుంది,
కన్నీల్లతొ కాళ్ళు కడుగుతుంది..
పగిలిన నాలుకలా,
నీటికై తపిస్తూ,
వలస పాదాలతో పరుగులు తీస్తుంటుంది..
మాడిన డొక్కలా,
ఆహారానికి అన్వేషిస్తూ,
ఆశల రెక్కలతో,
కష్టాల వీధుల్లో విహరిస్తుంటుంది.
నిరీక్షిస్తున్ననయనాల్లా
చెదిరిన స్వప్నాలతో,
నిషా వస్త్రాలతో,
అందని ఆనందాలకోసం,
గాయాల గుండెగా ప్రయానిస్తుంటుంది.
బీడుగా మారిన వర్తమానంతో,

జ్ఞాపకాలుగా మారిన గతాన్ని గుండెల్లో నింపుకొని,
అగమ్యమైన మార్గాలవెంబడి,
నిర్దిష్టం లేని భవితవ్యం కోసం,
కాల సంద్రంలో,
క్షణాల తెప్పపై ఈదుతూ ఉంటుంది.
సేద తీర్చే నీడ కోసం,
మెతుకునిచ్చే జాడ కోసం....
కరువు శత్రువు,
నా పల్లెను తాళాల సంకెళ్ళతో బంధించాడు..
బంధీ అయిన,
ఆనందాలు,
ఆప్యాయతలు,
విముక్తి చేసే మనిషి కోసం తల్లడిల్లుతున్నాయి..


ఇప్పుడు నా పల్లె,
మూగబోయిన తల్లి,
అనాధైన చెల్లి,
పరిమళాలు లేని జాజిమల్లి.......

29, ఆగస్టు 2011, సోమవారం

చివరి స్పర్శ(THE LAST TOUCH)........

పోతాను..
పోతాను..
నీ పెదాలాపైనుండి నడిచివచ్చిన నవ్వు,
నాకు దుఖంగ అందిన చోటునుండి..
నీ నోటినుండి జనించే మాటల పిడుగులై ,
నా మనసును కూల్చే చోటునుండి..
కన్నీళ్ళ కాసుల్ని కన్నుల్లో నింపుకొని..
మౌనపు మణుల్ని మూటగత్తుకొని..
పోతాను..
పోతాను..
ప్రేమే పాపమైన,
ధ్యాసే శాపమైన,
నేనంటే కోపమైన ,
కళ్ళముందు నుండి కదిలిపోతానూ..
మనసునుండి మాయమైపోతానూ..
పోతాను..
పోతాను..
నీతో నడిచిన ఒక్క దృశ్యమూ ..
నీతో గడిపిన ఒక్క సందర్భమూ..
నీతో వెల్లువిరిసిన ఒక్క సంతోషమూ..
నువ్వు తాకిన ఒక్క సన్నివేశమూ..
ఏవీ..
ఏవీ..
నా వెంట రావూ..
నీకోసం నేను ఖర్చుపెట్టిన ఆలోచనలూ,
నీకోసం నేను అనుభవించిన ఏకాంతాలూ,
గాయాలుగ మిగిలిన ఙ్ఞాపకాలూ,
తప్ప.
ఏవీ..
నా వెంట రావూ..
అయినా పోతాను..
భువి నుండి దివికి..
ఎదుటనుండి ఎదలోకి..
సాంగత్యం నుండి స్మృతిలోకి
సజీవం నుండి శూన్యంలోకి..
దారిలేని తీరంలోకి..
ఓ ప్రియా..!!!
నా చివరిచూపు నీ రూపంగ కరిగిపోవాలి..
నా చివరి శ్వాస నీలో చేరిపోవాలి..
నీ ఒడిలో ఒదిగిపోవాలి..
నీ చేతి స్పర్శలో చనిపోవాలి..
ఇదే నా చివరికోరిక..
అదే మన ఆఖరి కలయిక..
అదే మన ఆఖరి కలయిక..

కన్నీరు లేని కావ్యం....

నిశ్శబ్దపు ప్రాంగణంలో ఉన్న,
నావైపు తను నడుస్తూ వస్తుంటే,
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న  కాలి గజ్జెల సవ్వడి,
గతించిన నా గుండె సవ్వడిని,
ధ్వనిగా మార్చుకున్నాదో ఏమో అని అనిపిస్తుంది..
ఎడబాటు నుండి ఎదవైపుకు తను కదిలివస్తుంటే,
మాసిపోయిన నా మౌనాలన్నింటిని మాటలుగా మలిచి,
కర్ణబేరుల్ని మోగించడానికి వస్తున్నదో అన్నట్టుంది.
తను కళ్ళెత్తి చూస్తె పడే ఆ చూపుల వర్షం,
నా గుండెల్లో ప్రేమ జల్లులై పడి,
ఆనంద పువ్వుల్ని పూయిస్తాయి.
తను తాకిందంటే ఆ స్పర్శ హర్షమై,
ఆత్మీయ అనురాగాల్ని అణువణువు నిపుతుంది..
ఇక తను నాతో సాగిందంటే,
క్షణమో రసమై,
నిమిషమో అనుభవమై,
జీవితాన్ని ఆకాశంలోని మేఘంలా,
అలుపెరగని ప్రవాహంలా,
ఆటంకంలేని గమనంలా మార్చేస్తుంది..
నిరంతరం నవ్వై,
ప్రేమ పువ్వై,
పరిమళాల్ని పంచుతుంది..
కన్నీరు లేని కావ్యంగా,
నన్ను మారుస్తుంది..

చూపులు.....

ప్రపంచమంత బాదామయమైనప్పుడు,
గుండె నిండ దుఖాలు ఆవరించినప్పుడు,
నా చెలీ కళ్ళలోకి చూడాలనుకుంటాను,
ఎందుకంటే...
నా ప్రాణమైన తన చూపులు,
ఈ లోకాన్ని,
నా శోకాన్ని,
క్షాళనం చెస్తాయనీ..
ప్రశాంతతను ప్రసాదిస్తాయనీ..

ఏకాంతత నన్ను బంధించినప్పుడు,
ఆలోచనలు కాటు వేసునప్పుడు,
నా ప్రియురాలీ సాంగత్యంలోకి పోవాలనుకుంటాను,

ఎందుకంటే...
నా ఒంటరితనాన్ని,
రేగే గాయాల్ని,
దూరం చేస్తుందనీ..
మమకారం పంచుతుందనీ..  

ప్రేమఖైది.....

సఖీ..!!!
బడి చదివేటప్పడినుండి,
గుండెల్లో ప్రేమ గుడి కట్టాను నీకోసం..
విరచిస్తున్న ప్రేమ కావ్యానికి,
నాయకివై వెంట నడిచావూ..
అక్షరం అక్షరం ఒక అడుగై,
ఎన్నో స్థలాల్ని ముద్దాడాము..
నా పాదమై తోడున్నావూ..
నీ శ్వాసతో పువ్వుల్ని పూయించావూ,
నీ మాటతో కొండల్ని నవ్వించావూ,
నీ స్పర్శతో నదుల్ని లాలించావూ,
 నా చిన్నప్పటి ప్రేమవై పెరిగావూ..

కష్టాలొచ్చిన,
కలతలొచ్చిన,
నీ ఎదపై వాలనిదె నాకు వసంతం లేదు..
కన్నీరొచ్చిన,
పన్నిరొచ్చిన,
నిన్ను తాకనిదే నాకు ఆనందం లేదు..
నీకు గుచ్చుకొన్నది చిన్న మేకైన,
అది బాకై నా మనసులో దిగుతుంది..
నీ నుండి కారిన రక్త బిందువులు,
నా మనసువే కదా...
నీకు వచ్చింది చిన్న కన్నీటి బొట్టైన,
అది తుపానై నన్ను ముంచేస్తుంది,
ఆప్పుడు నేను కరిగిపోయిన మేఘాన్నవుతాను..

హాయిగా సాగిపోతున్న,
ప్రేమ కావ్యనికి ఓ విషాద మలుపు..
ప్రవహిస్తున్న గుండెలకు అలుపు..
అనుమాన హస్తం,
మరణ పంజరంలో బంధించిన మైనావయావూ..
యమపాశం వదిలిన ఏడుపువయ్యావూ..
కాలానికి ఎమిచెప్పలేక,
ఇక వెలుగేలేని సూరిన్నయ్యానూ..
ఎందుకంటే నేను నీ "ప్రేమఖైదీ"ని,
చావులో కూడ నీ తోడు లేనిదే,
నాకు జీవనం లేదు..
నువ్వు లేకపోతే నాకు మనుగడ రాదు..
ప్రేమ  
హృదయాలపై వాలే,
జంట సీతాకోకచిలుకలవుతామూ..
కొద్ది కాలపు యవ్వనికపై,
విషాద సినిమా అవుతామూ..

16, ఆగస్టు 2011, మంగళవారం

ఒక చూపు......

ఎప్పుడో ఒక్కప్పుడు
ప్రతి మనసు ఒక చూపుకు స్పందిస్తుంది.
ఆ చూపు ఇష్టంగ మారి,
ప్రేమగ చిగురించి,
జీవితమై నిలుస్తుంది,
ప్రతి సారి ఆ చూపునే మనసు తలుస్తుంది,
తనని తాను మరుస్తుంది..
తనని తాను మరుస్తుంది.

"నేనంటె చాల ఇష్టం"...

కడవరకు తోడుండి,
అమ్మలా ప్రేమను పంచుతానన్న మమకారం,
మధ్యలోనే మౌనమయ్యింది..
పలుకుగా మారిన నాలోని భావవేమో,
పిలిచినచలించని మనసులేక,
శూన్యంలోనె సాగిపోతుంది..
"నేనంటె చాల ఇష్టం" అన్న అక్షరాలు మళ్ళి కలవక,
ఆత్మబలిదానంచేసుకొన్న ఆశ,
నిప్పంటించే తోడుకై ఎదురుచూస్తుంది..
నీ ప్రేమతో
జతగమారిన నా హృదయస్పందన,
కారణములేకుండ నువ్వు వీడిపోతె,
ఒంటరై,
నిర్జీవమై..
నిశ్శబ్దమై..
దేహానికి
ఆత్మను అంటరానిదిగ మార్చేసింది..
నన్ను నిలువున కూల్చేసింది..
ఆపై నేను..
వాయువై నీలో చేరిపోతా..
స్పందనై నీ తోడుంట.....
స్పందనై నీ తోడుంట.....

నేను ఇష్టాన్నో..!! లేక ద్వేషాన్నో..!!


కష్టాల మబ్బులు ఆవరించి,
కన్నీళ్ళ ముసురు పట్టింది నా జీవితానికి,
ఆలోచన ఉరుములతోటి,
ఙ్ఞాపకాల పిడుగులు పడుతున్నాయి నా మన్సు మీద..
నీ ఎడబాటుతో..

ఈ క్షణం నిన్ను ప్రేమించవద్దనుకుంటూనే,
ప్రతి క్షణం నీ ద్యాసతో అనుభవమై వెలుగుతుంది..
ఈ నిమిషం నిన్ను గుర్తుకుతెచ్చుకోవద్దనుకుంటూనే,
ప్రతి నిమిషం నీ రూపమై చిరునవ్వుల్ని చిందిస్తుంది..
కాలం వేటకు,
బలైన సంతోషాన్నయ్యాను..
క్షణాల తూటాలకు,
ఆరిపోబోతున్న ఊపిరినవుతానేమో..??
నేను ప్రేమికున్నో..!!
లేక దుఖితున్నో..!!   నీ తలపులో...
నేను ఇష్టాన్నో..!!
లేక ద్వేషాన్నో..!!   నీ మనసులో...

15, ఆగస్టు 2011, సోమవారం

నా దేహమొక మ్యూజియం.........

అమ్మ కౌగిలి కరువై,
అమ్మ ప్రేమ దూరమై,
చాల సంవత్సరాలయ్యింది..
అమ్మ పదం విన్నప్పుడల్ల,
అంతరంగం అల్లకల్లోలమై,
భావాలు కన్నీల్లతో తడిసి,
గుండెపై కురవగ,
మనస్సు భారమైపోతుంది..

వెలుగు నిండిన దారంత,
చీకటిమయమై,
లోకమంత చీకటితో కలిసి,
నా కన్నులపై వాలగా,
నిద్రించిన నా నయనాలు,
కలలో అంతంలేని మార్గాల వెంబడి పరుగులు తీస్తుంటాయి..
శ్మశానాల  వాకిల్లలోచేరి దుఖిస్తుంటాయి..
తడి కన్నులతో చూసిన దృశ్యంలా,
ఎప్పు డో చూసిన అమ్మ రూపాన్ని,
పలకరించని మౌనభాషగ,
జాగ్రత్తగ నిలిపాను నా హృదయంలో,
అమ్మ నా వెంటే సాగుతుంది ప్రతి పాదంలో,
దారిగా మారి..
అమ్మ నాతోనే ఉంటుంది ప్రతి స్పందనలో,
శ్వాసగచేరి..
కాలంతో సాగేది మారుతుంది,
కానీ నా గుండెల్లో ఉన్న అమ్మ రూపం మారలేదు,
ఆనాటికి..
ఈనాటికీ.. చిరునవ్వులా....
అమ్మ ఙ్ఞాపకాల్ని అణువణువు భద్రపరిచిన,
విలువైన సంతోష క్షణాల్ని నిలిపిన,
నా దేహమొక మ్యూజియం,
నా శరిరం అమ్మకోసమే నిర్మించబడ్డ దేవాలయం..
అప్పుడు..
ఇప్పుడు..
ఎప్పుడు..
నేనొక భక్తున్నే..
నిరంతర దుఖితున్నే...
నిరంతర దుఖితున్నే...

11, ఆగస్టు 2011, గురువారం

ఓ కలగ మిగిలిపోవాలి...

ప్రియా..!!!
నా జీవితమైన బాధ,
నీకు ఒక్క క్షణమే ఉండాలి...

నా చిరకాల దురదృష్టం,
నీకు ఒక్కసారితో తీరిపోవాలి...

నేను ఎల్లప్పుడు అనుభవిస్తున్న కష్టం,
నీకు ఒక్క అడుగుతోనే అంతం కావాలి...

నా నీడైఉండే అవమానం,
ఒక్క సూర్యోదయంతో చేజారిపోవాలి...

నేను సదాపొందె దుఖం,
నీకు రెప్పపాటుతో ముగిసిపోవాలి...

నా సకలమై వెంట సాగె ప్రెమ,
నీకు ఓ కలగ మిగిలిపోవాలి...

కాలం కక్ష......

ఆశలను మనసంత నింపుకొని,
సంతోషాలను భద్రపరుచుకొని,
అదృష్టాన్ని  పరిక్షించదలుచుకొని,
కొత్త సూర్యోదయపు కిరణాల్ని చూడాలనుకొని,
జీవితాన్ని నూతనంగ అవిష్కరించదలుచుకొని,
దుఖపు గతాన్ని మరవాలని,
ఆనందతీరాల్ని చేరాలనుకున్న..
కానీ..
కాలం కక్షగట్టి,
దురదృష్టం  పగబట్టి,
శ్వేతవర్ణంగల నా మనసుని,
సౌధంల పొదిగే నా ఆశల్ని,
లేతచిగురులాంటి నా జీవితాన్ని,
మసిపూసి,
కూలగొట్టి,
నరికివేసి,
నా జీవిత సామ్రాజ్యానికి అధిపతులై,
నిరంతర నిస్పృహ లతో,
బాధలతో,
శత్రుపక్ష కక్షతో నన్నెప్పుడు అంతమొందించాలా అని చూస్తున్నాయి..
ఆరాటపడుతున్నాయి..


మృత్యువివి....

ప్రియ బాంధవీ..!!!!
ఒక్కప్పుడు నువ్వు,
నన్ను చేరని చిరునామావి..

ఆ తర్వాత,
నన్ను కలిసిన చూపువి..

ఆ తర్వాత,
నా అంతరంగంలో ప్రేమదీపాన్ని వెలిగించిన దేవతవి..
నా అడుగుల దారిని మార్చిన గమ్యానివి..

కానీ ఇప్పుడు....
నన్ను చూస్తూ కూడ,
పలకరించని శబ్దానివి..
నా ముందే తిరుగుతు కూడ,
నన్ను చేరని చిరునవ్వువి..
నాతోనే ఉంటు కూడ,
నన్ను స్పర్శించని ఆనందానివి..
క్షణాల శిలలకు,
నా ఆలోచనల్ని వేలాడతీస్తున్న కాలానివి..

ఇక రేపు...
అంతంచెందించనిదే,
పంతం వదలని ద్వేషానివి..
జీవన పడవను,
ముంచనున్న సునామివి..
నా ప్రియ మృత్యువివి..
కొరి తెచ్చుకున్న శత్రువివి...

పండుటాకును నేను....


క్షణాల కెరటాల కింద,
చిక్కుపోయిన నీటి బిందువుని నేను....
దుఖపు మబ్బు నిండ,
వ్యాపించిన కన్నీటి చుక్కని నేను....
కష్టాల పెదాల మీద,
నర్తించిన ఏడుపు శబ్దాన్ని నేను....
కలతల పందిరిపైన,
ఎండిపోయిన ఆశ లతను నేను....
ప్రేమ ఆకాశం నుంచి,
రాలిపోయిన ద్వేష నక్షత్రాన్ని నేను....
ప్రపంచ వృక్షము నుండి,
జారిపోయిన పండుటాకును నేను....

నా బ్రతుకు...........
నిరాశల సౌధం,
నిట్టూర్పుల ఆలయం,
కన్నీళ్ళ కోవెల,
ఆరిపొయిన జ్వాల.....

నా కవిత్వమొక........

గుక్కపట్టి ఏడ్చే పసి పిల్లలకు,
నా కవిత్వమొక తూగుటుయ్యాల..
విరహవేదనలో అలాడుతున్న మనసుకి,
నా కవిత్వమొక శాంతి కోవెల..
పనిచేసి అలసి సొలసిన శ్రామికులకి,
నా కవిత్వమొక ఆహ్లాదపు కోయిల..
గాఢాంధకారము అలుముకున్న బ్రతుకులకు,
నా కవిత్వమొక ద్వీపపు జ్వాల..
శ్రమిస్తున్న కర్షకుల పదాలకు,
నా కవిత్వమొక రాగాల మాల..
క్షరమైపోతున్న క్షణాల్ని క్షేమంగ దాచే,
స్నేహపు శాల..
సంతోషపు బిందువుల్నిహృదయాల  తీరానికిచేర్చే,
పదాల అల...

సకల కళ మేల,
అనుభవాల కోవెల,
అందమైన బాల,
గుండెనుండి చిమ్ముకొచ్చిన అక్షర లావ,
చేస్తుంది ఙ్ఞానికి పాదసేవ.....
చేస్తుంది ఙ్ఞానికి పాదసేవ.....


9, ఆగస్టు 2011, మంగళవారం

వశిష్టులు......

చేసిన ప్రతి కార్యం విజయము పొందాలని  "జై" అంటు,
జీవితయాత్రలో వ్యవసాయముచేసి ఘనత సాదించాలని "కిషన్"గా కూర్చి,
"జై కిషన్" గా మలిచారు మీ నామధేయము...
జారిపోతున్న ఎన్నో  పేదరికపు బ్రతుకులకి చేయూతనందించిన,
మానవత్వం మూర్తీభవించిన మాన్యులు మీరు...

కూరుకుపోతున్న ధర్మపురి చరిత్రని,
నిరంతర పరిశోధనతో వెలికితీసి,
దేదీప్యమానంగ వెలిగించి,
ప్రపంచానికే పరిచయంచేసిన ప్రముఖులు మీరు...

అంతరించిపోతున్న ఇనుము ఉక్కు పరిశ్రమని,
మీ సాధనతో నిలబెట్టి,
చేతబట్టి,
ఉత్తర తెలంగాణకి వెలుగునిచ్చిన ప్రధాతలు మీరు...

చరిత్ర రాజ్యానికి,
మీ అమూల్యమైన  శోధనలు అందించి,
చరిత్రనే సుసంపన్నంచేసి,
సువిశాలంగ విస్తరింపజేసి,
ఎంతో మంది వాక్కుల్లో ఒదిగిన వశిష్టులు మీరు.....

సాయంకళాశాలలో అధ్యాపకులుగ పనిచేస్తు,
అసహాయంతో అర్వాచీన ఆశ్రయాలను పరిశీలించి,
మరోచరిత్ర సృష్టించిన  గొప్ప చరిత్రకారులు మీరు......

అనవరత అధ్యాయనతత్పరులు,
సతతము శ్రమించె  కృషివరులు,
మా అంతరంగాల్ని చక్కబెట్టిన మనోవైద్యులు,
సంతోషాన్ని పండించే సేద్యులు,
ప్రతివారి క్షేమాన్ని కాంక్షించే సజ్జనులు,
మహానుభావులు,
పూజ్యనీయులు,,
మా గురువర్యులు,
ఆదర్శ ఆచార్యులు,
డా''  'జై కిషన్" గారు......

ఆశలకోసం అన్వేషణ ..........

తండ్రి లేక,
తల్లి లేక అనాథవైనవాడా..
తిండి లేక,
నిద్ర లేక బలహీనమైనవాడా..
ఏమిటి ఈ బ్రతుకు,
దొరకడంలేద చిన్ని అన్నం మెతుకు,
ఆకలితో ఆర్తగీతం చేస్తు,
చెత్తకుప్పలతో స్నేహం చేస్తు,
నిరంతరం పరిశోధకుడివై,
నీ కడుపు నింపుకొనుటకై కష్టపడుతున్నావా.. ?
ఏమీ ఈ దౌర్భాగ్యమని నిందించుకుంటున్నావా.?
కస్టాల్ని సంచుల్లో నింపుకొని,
ఆకాశాన్ని వస్త్రంగ కప్పుకొని,
ఆశలకోసం అన్వేషిస్తున్నావా.?
ఎవరి మీదో తెలియని కోపంతో,
అధికంగ వేసే తాపంతో,
కాలంతో పోరాడుతున్నావా..?
జీవితాన్ని ఎండిన వాగుగ సాగిస్తునావా.?

ఓ స్నేహితుడా....!!!!
అనాథవైనా అన్ని ఉన్నాయనుకునే వాడివి నువ్వు,
అన్నీ ఉన్నా అనాథను నేను..
నీకన్న నేనేనయ్యా నిజమైన అనాథని,
ఓ గాథని...
నిరంతర వ్యథని..

అస్తమయం...........

ఊర్వశి....!!!!!!
నీ కలయికతో,
కాలాన్ని కలలతో కవ్వించావు..
నీ స్పర్శతో,
మనసును భావాలతో అలంకరించావు..
మన మధ్య దూరానికి చూపుల వంతెన కట్టి,
నా హృదయ  తలుపులు తట్టి,
మానస కోవెల్లో కోమలివై పాదం పెట్టి,
మునపటి లోకమంత నువ్వుగ మారావు..
నా కన్నుల రాళ్ళపై అందమైన  దృశ్యాల్ని చెక్కావు..
నీ మాటల్తో బ్రతుకంత మధురంగ మలిచావు..
రూపమొక్కటే నేను,
నా అణువణువు నువ్వుగా మారిన తర్వాత,
నువ్వు నన్ను వీడిపోయావు..
నాకు దూరమయ్యావు..
నీ ప్రేమను ఆశించిన మనసుకు మళ్ళి ఆశనే మిగిల్చావు..
జటకోసం వెతికిన పాదానికి దారినే చూపావు..
తరంగంల నిను చేరిన ప్రతిసారి,
విషాదాన్నే మిగిల్చావు..
వెలుగై నిన్ను కలిసిన ప్రతిసారి,
చీకాటిగానే మార్చావు..

రేపు...........
నీకు...
ఈ లోకానికి......
సూర్యోదయం......
నాకు....
నా మనసుకు....
అస్తమయం...........
అస్తమయం...........

8, ఆగస్టు 2011, సోమవారం

ద్వేషం....

జారిన కన్నీటి బొట్టుకే తెలుసు,
ఎడబాటు ఎంత విషాదమైనదో అని,.

మూగబోయిన  కోయిలకే తెలుసు,
మౌనం ఎంత బరువైనదో అని,....

చీకటైన రాత్రికే తెలుసు,
ఒంటరితనం ఎంత కటినమైనదో అని...

పగిలిన నా మనస్సుకే తెలుసు,
ద్వేషం ఎంత తీవ్రమైనదో అని...
ద్వేషం ఎంత తీవ్రమైనదో అని...

6, ఆగస్టు 2011, శనివారం

ఏ మనసు పెట్టిన శాపమో...???

నువ్వు నవ్వే ప్రతి నవ్వు,
నా గుండేల్లో గునపాలై గుచ్చుతున్నాయి.....
నువ్వు పంచుకుంటున్న ప్రతి ఆనందం,
నన్ను దుఖసంద్రంలోకి తీసుకెల్తున్నాయి.....
నువ్వు వేసే ప్రతి అడుగు,
నన్ను స్మశానంవైపు నడిపిస్తున్నాయి......
నువ్వు పలికే ప్రతి పలుకు,
నాకు మౌనపు విషాన్ని తాగిస్తున్నాయి......
నువ్వు చేసే ప్రతి క్రియ,
నన్ను నిర్జీవంగ మార్చేస్తున్నాయి....
ఓ కాలమా..!!!!
నాకు ఎందుకింత కష్టము,
నాకు ఎందుకింత క్లిష్టము,
నాకు ఎందుకింత మనస్తాపన,
నాకు ఎందుకింత దుఖస్థాపన,.......
ఏ జన్మలో చేసిన పాపమో,..???
ఏ మనసు పెట్టిన శాపమో...???

స్పందన రాగం..

ఇష్టసఖీ...!!!!
నీ మనసు కలతచెందిందంటే,
నా హృదయస్పందనను రాగంగ మలిచి సేదతీర్చుతా....
నీ నయనం అలిసిపోయిందంటే,
నా ఆలోచనల్ని ఊయలగ చేసి జోకొడుతా....
నీ దేహం వణికిపోతుందంటే,
నా ఊపిరిని వేడిగ తయారుచేసి తగ్గిస్తా....
నీకు ఆకలయ్యిందంటే,
నా ఙ్ఞాపకాల్ని ఆహారంగ వండి అందిస్తా......
నీ ప్రయాణం ఒంటరయ్యిందంటే,
నా పాదాల్ని దారిగ పరిచి నడిపిస్తా....
నీకు కాలం భారమయ్యిందంటే,
నా ప్రేమను రమ్యాలోకంగ నిర్మించి బహుకరిస్తా......
పలుకుల బొమ్మలతో ఆడిపిస్తా......

అంతట నిండి వున్నావు....

ఓ దేవి..!!!
నా ఎదురుగ నువ్వు లేకపోయినా,
గుండేల్లో కొలువైనావు..
కన్నులకు కనిపించకపోయినా,
కనుచూపువైనవు..
రాగం నువ్వుకాకపోయినా,
గొంతువై నిలిచున్నావు..
తోడుగ లేకపోయినా,
అణువణువు నిండిపోయావు..
నీడవై లేకపోయినా,
రూపమై ప్రతిబింబించావు..
ఆనందమై ఆశ్రయించకపోయినా,
దుఖమై క్షణక్షణం సాగుతున్నావు..
అమ్రుతాన్ని అందించకపోయినా,
దుఖపువిషాన్ని తాగిస్తున్నావు..
మనసును ఆర్థం చేసుకోపోయినా,
ప్రియురాలివై ప్రేమనిచ్చావు..
నన్ను వదిలిపోయనా,
ఙ్ఞాపకమై అంతట నిండి వున్నావు..
              అంతట నిండి వున్నావు.. 

,ఓ జీవితం.

జననం,
మనకు ప్రపంచాన్ని పరిచయంచేస్తుంది..
ప్రతిభ,
జీవితానికి ఆర్థాన్నిస్తుంది..
స్నేహం,
కష్ట,సుఖాల్లో  చేయూతనిస్తుంది..
ప్రేమా,
ఒక మనసుతో మరో మనసును జోడిస్తుంది..
జీవితాంతం మిగిలే ఙ్ఞాపకాలనిస్తుంది..
మరణం,
బంధాలన్నిటినుండి దూరంచేస్తుంది..
మరోచోటికి  ఒంటరిగ సాగనంపుతుంది..
మరో జన్మకి ఆరంభాన్ని పలుకుతుంది..
మనల్ని ఓ స్మ్రుతిగ మారుస్తుంది..
             ఓ స్మ్రుతిగ మారుస్తుంది..

ప్రేమ సామ్రాజ్యం.....

నా ప్రాణమా..!!!!
నా లో నీకు గుడిని కాదు,
ఏకంగా ప్రేమ సామ్రాజ్యాన్నే నిర్మించాను..
నా రాజ్యానికి నిన్ను మహరాణిని చేసాను..
ఆ రాజ్యంలో.......
నువ్వు పలుకుతున్న ప్రతి మాట,
నా గుండె చప్పుడై వినిపిస్తుంది..
నువ్వు చూసే ప్రతి చూపు ,
నాకు ద్రుశ్యమై కనిపిస్తుంది..
నువ్వు పొందే ఆనందం,
నా ఊపిరై సాగుతుంది..
నువ్వు చేసె ప్రయాణము,
నా రక్త ప్రవాహమై సాగుతుంది..
నువ్వు జీవిస్తున్న చోటు,
నా శరీరాన్ని రక్షిస్తుంది..


కానీ............
నువ్వు నన్ను ప్రేమించక,
                     కరుణించక,
ప్రేమ సామ్రాజ్యంలో తిరుగుతుంటే.....
సంతోషంతో విహరిస్తుంటే.....
నీ పాద తాకిడికి,
మనస్సు బాధపడుతుంది..
ఆ బాధ నిరంతరం నిన్నే గుర్తుకు తెస్తుంది..
                                 నన్నే మరిపిస్తుంది..

ఒక్క మాటతో..........

"ప్రేమించాను" అనే ఒక్క మాటతో,
నా శవానికి ప్రాణం వస్తుందంతే చెప్పలేవా..???
"మనసిచ్చాను" అనే ఒక్క మాటతో,
నా మనసు చిగురిస్తుందంటే చెప్పలేవా..???
"కరుణించాను" అనే ఒక్క మాటతో,
నా ప్రేమ సామ్రాజ్యం నిలుస్తుందంటే చెప్పలేవా..???
'ఆరాధిస్తానూ అనే ఒక్క మాటతో,
నేను సంతోషంగ ఉంటానంటే చెప్పలేవా..???
"నీ జీవితమై ఉంటానూ అనే ఒక్క మాటతో,
నా జీవితం సుఖంగ ఉంటుందంటే చెప్పలేవా..???
"నీ తోడై  ఉంట"   అనే ఒక్క మాటతో,
ఈ లోకాన్ని జయిస్తనంటే చెప్పలేవా..???
నా సర్వస్వం నువ్వు"  అనే ఒక్క మాటతో,
మోడైన నా జిందగి చిగురిస్తుందంటే చెప్పలేవా..???
"నేను నువ్వుగ నిలుస్తాను" అనే ఒక్క మాటతో,
నా కలలు నిజాలవుతాయంటే   చెప్పలేవా..???
నా కలలు నిజాలవుతాయంటే   చెప్పలేవా..???

ఏమిటి.???

కన్నులుండి ఏమిటీ.?
కనుచూపైన నువ్వే లేకపోతే..
కాళ్ళుండి ఏమిటి.?
చలనమైన నువ్వే లేకపోతే..
రాగముండి ఏమిటి.?
గొంతైన నువ్వే లేకపోతే..
పలుకుండి ఏమిటి.?
నాలుకైన నువ్వే లేకపోతే..
వాయువుండి ఏమిటి.?
ప్రాణమైన నువ్వే లేకపోతే..
హృదయముండి  ఏమిటి.?
స్పందనైన నువ్వే లేకపోతే..
కళుండి ఏమిటి.?
దానిని తీర్చే నువ్వే లేకపోతే..
ప్రేముండి ఏమిటి.?
కరునించే నువ్వే లేకపోతే..
మనసుండి ఏమిటి.?
బ్రతికించే నువ్వే లేకపోతే..
అనురాగముండి ఏమిటి.?
ఆదరించే  నువ్వే లేకపోతే..
ఆదరించే  నువ్వే లేకపోతే..

బ్రతకాలన్న ఆశలేదు...

కలలున్నాయి,
కానీ తీరే వీలులేదు..
ఆశలున్నాయి,
కానీ సరిపడ  ధనము లేదు..
జీవితముంది,
కానీ బ్రతకాలన్న ఆశలేదు..
ప్రేముంది,
కానీ అర్థంచేసుకునే మనసులేదు..
మనసుంది,
కానీ ఆదరించే తోడులేదు..
సంతోషముంది,
కానీ ఉండేందుకు సమయము లేదు..
అనురాగముంది,
కానీ పంచుకునే ప్రియురాలు లేదు..

ఎంత బంధించిన......

ప్రేమ దీపమా..!!!!
నా కన్నులను ఎంత బంధించిన,
నీ రూపాన్నే గుర్తుకు తెస్తున్నాయి..
ఆలోచనల్ని ఎంత తక్కువ చేసిన,
నీ గురించె ఆలోచిస్తున్నాయి...
నా ప్రయాణాన్ని ఎంత నిలిపివేసిన,
నీ వైపే నా అడుగులు సాగుతున్నాయి..
నీపై ప్రేమను ఎంత తగ్గించిన,
అంత ప్రేమ నీపై ఎక్కువవుతుంది..
నా మనసును ఎంత స్వాదీనం చేసిన,
నీ ప్రేమనే ఆశ్రయిస్తుంది..
నీ ఙ్ఞాపకాల్ని ఎంత ఖండించిన,
పదే పదే నిన్ను గుర్తుకు తెస్తున్నాయి..
నా పలుకుల్ని ఎంత తక్కువ చేసిన,
నీ పేరునే జపిస్తుంది..
నీ పేరునే జపిస్తుంది..

నా హృదయస్పందన నువ్వు...

ఓ అమ్రుతమా..!!!!
నేను శరీరమైతే,
నాలోని ప్రాణం నువ్వు..

నేను హృదయమైతే,
నా హృదయస్పందన నువ్వు..

నేను కన్నులైతే,
నా కన్నులచూపు నువ్వు..

నాది రాగమైతె,
నా ప్రేమ గానం నువ్వు..

నేను పుస్తకమైతే,
దానిలోని ప్రతి అక్షరం నువ్వు..

నాది మనసైతే,
ఆశ్రయించే తోడు నువ్వు..

నేను బాధైతే,
నాలోని సంతోషం నువ్వు..

నేను కవినైతే,
నాలోని భావన నువ్వు..

నేను మాటనైతే,
మాటలోని శబ్దం నువ్వు..

నేను జతనైతే,
నా జంట నువ్వు..

నేను మరణమైతే,
నా జీవనం నువ్వు..
నా జీవనం నువ్వు..

గుండెల్లో కొలువుంటావనుకుంటే....

ఓ సఖీ..!!!
నీకు పసుపుతాడై ఉండాలనుకుంటే,
నాకు ఉరితాడై బిగిసావు..

జతగ నీ తోడు ఉండాలనుకుంటే,
ఒంటరిగ జీవించేల చేసావు..

వరమై నాన్ను వరిస్తావనుకుంటే,
శాపమై దూరమయ్యావు..

నిజమై ఎదురస్తావనుకుంటే,
కలలాగే మిగిలిపోయావు..

అమ్రుతాన్ని పంచుతావనుకుంటే,
విషాన్ని చేతికందించావు..

ఆనందాన్ని ఇస్తావనుకుంటే,
తీరని బాధను మిగిల్చావు..

హ్రుదయరాణిగ ఉంటావనుకుంటే,
ప్రేమ సామ్రాజ్యాన్ని కూల్చేసావు..

గుండెల్లో కొలువుంటావనుకుంటే,
మనసునే నీతో తీసుకెల్లావు..
మనసునే నీతో తీసుకెల్లావు..

5, ఆగస్టు 2011, శుక్రవారం

స్నేహజలపాతం....


అనుభవించిన అన్ని క్షణాలు
అంతిమ దశవరకు నడచిరావు,
కాని వీడని క్షణాలన్నింటిని
నీ స్నేహంలోనె సంపాదించినవి.....

చేరువకాని ఎన్నో తీరాలుంటాయి,
తరగని అనేక దూరాలుంటాయి,
దూరాల్ని చెరిపేసి,
తీరాల్ని పాదాలకు తాకించె మైత్రి నీది.............

అందిరాని అమూల్య వరాలుంటాయి,
బరువైన హృదయ  భారాలుంటాయి,
భారాల్ని బంధించి,
వరాల్ని వారాలుగ వ్యవస్థాపన చేసె చెలిమి నీది.............

నీ స్నేహజలపాతంలో,
సదా తడిసిపోతా..
        మురిసిపోతా..

దారిగ పరిచి...

నీతో తిరిగిన ప్రతి ప్రదేశం,
నా కాళ్ళను బంధిస్తుంటే,
కదలలేని శిలనై నీకోసమే నిలిచున్నాను..

నీతో కలిసి చూసిన ప్రతి ప్రాంతం ,
నా కళ్ళను కాటేస్తుంటే,
కనుచూపులను దారిగ పరిచి నీకోసమే వేచి ఉన్నా...

నీతో గడిపిన ప్రతిక్షణం,
మనసుపై పూల మొక్కలై మొలుస్తుంటే,
నువ్వులేని క్షణాల్ని పువ్వులుగ పూయించి,
నీకోసమే ఎదురుచూస్తున్నా...

నువ్వు పలికిన ప్రతి పదం,
అనుభవమై నా జీవితాన్ని శాసిస్తుంటే,
మిగిలిన జీవితాన్ని నీకు అంకితమివ్వడానికి ,
నీ కోసమే బ్రతికున్నా...
""ఎండిన మనసుతో,
కాంతిలేని ఉషస్సుతో..""

నీకోసం....

పద్మినీ..
నీకోసం,
ఎన్నో చిరునవ్వుల పువ్వుల్ని,
నా పెదాల నుండి చిదిమేసాను...

నీకోసం
కలల తారల్ని,
నా నిద్రాకాశం నుండి దూరంచేసాను...

నీకోసం,
ఆశల పత్రాల్ని,
నా జీవిత పద్మం నుండి చిదిమేసాను...

నీకోసం,
సంతోషపు రత్నాల్ని,
నా హ్రుదయ గుప్తనిధి నుండి దానంచేసాను...

నీకోసం,
పలుకుల తేనెల్ని,
నా మౌనపు తుమ్మెదలకి అంకితంచేసాను...

నీకోసం,
మనసు మంచు ముక్కని,
విరహాగ్నితో కన్నీళ్ళుగ కరిగించాను...

నీకోసం,
చెక్కిళ్ళ అమ్మాయికి,
అశ్రువుల హారాన్ని బహుకరించాను...

సఖీ..!!!!
అన్నీ కోల్పోయిన నాకు,
ఆన్నీ దరికి తేను,
నన్ను, నా మనసును
కరుణించవేమే.. ??
కనికరించవేమే..?? 
కనికరించవేమే.. ??  

పరాయి లోకం



రేపైన నీ మనసు మారి,
నన్ను ప్రేమిస్తావనే ఆశతో,
ప్రతి రాత్రిని రగిలిపోతు గడిపేస్తున్నాను...
రేపైన మన ఎడబాటు సరస్సు ఎండిపోయి,
నా దరికి చేరుకుంటావనే కోరికతో,
ఒంటరితనంపై ఓడిపొతు సాగుతున్నాను...
మమకారం నీ మాటలుగ
నన్ను ముసురుకుంటుందనే నమ్మకంతో,
పలుకులను పరెసుకుంటూ కదులుతున్నాను...

నీ మనసు మారనప్పుడు..
ఎడబాటు ఎండనప్పుడూ..
మౌనం మాయం కానప్పుడూ..
నువ్వు అంగీకరించనప్పుడూ..
అనురాగాన్ని పంచనప్పుడూ..
నువ్వు ప్రేమించనప్పుడూ..
ఇక నేను...............
కన్నులను కదపడమెందుకూ..
శ్వాసని శ్వాగతించడమెందుకూ..
పరాయి లోకంలోకి పారిపోకా..
దుఖాలకి దూరంకాకా..

దూరం..సుదూరం...

చెలి..!!
నీ కనుచూపుల వాకిట్లో
 నా నయనాలు ప్రేమగ వేచి ఉంటాయి చూడు..
నీ ఆనంద  పందిరిపై,
నా ఆశల లతలు వాడిపోయి మిగిలుంటాయి 
చూడు..
నీ గుండె ఆలయంలో,
నా మనస్సు శిథిలమై ఉంటుంది 
చూడు,
నీ కలల సామ్రాజ్యం కింద,
నిద్రించని రాత్రులు సమాధియై ఉంటాయి 
చూడు,
నీ అదృష్ట  గ్రహంపై,
నా దురదృష్టపు స్త్రీకాలి గుర్తులుంటయి 
చూడు,
నీ అడుగుల కింద,
నశించిన నా కన్నీటి క్షణాలుంటాయి 
చూడు ..
నీ సంతోష లోకంలో,
నా ఆనంద బాలికలు ఏడుస్తు ఎదురస్తాయి చూడు..


సఖీ...!!!!
మనిద్దరి మనసులు ఒకటైన వేళ,
గెలుపు,ఓటమి
చావు,బ్రతుకు ఇరువురికి సమానం...
నీ మనస్సు అంగీకరించని నా మనసు వేరైనప్పుడు,
""గెలుపు నీదైతే,
ఓటమి నాదె కదా..
  ఆనందం నీదైతే,
అలజడి నాదే కదా..
ఈలోకం స్వర్గం నీకైతే,
నరకం నాకే కదా..
ఇకపై..........
జీవనం నీకైతే,
నా మనస్సుకు,
నాకు,
మరణమే కదా..
నీ రూపం,

నీ జ్ఞాపకం  దూరమే కదా..


4, ఆగస్టు 2011, గురువారం

ఒంటరిని చేసింది..



జలజాక్షీ..!!!
ఎందుకు నింపుకున్నావో,
నీ అణువణువున ప్రణయాన్ని,
దానికై నా మనసు మనసుపడి,
ఎడారిలోని జాబిల్లిల నన్ను ఒంటరిని చేసింది..
పువ్వుచుట్టు తుమ్మెదల నీ చుట్టె నా ఆలోచనల్ని తింపుతుంది..
నువ్వు నన్ను ప్రేమించకపోయేసరికి కన్నీరుగ కరుగుతుంది..

ఎంత అక్షరవర్షం కురిపించాలో?,
రేగె విరహాగ్నిని చల్లార్చేందుకు..
ఎంత సంతోషాన్ని ఆపుతెచ్చుకోవాలో?,
కలిగె దుఖాన్ని తొలగించేందుకు..
ఎంత ప్రేమను మట్టిలో కలపాలో?,
క్షణం నన్ను దాటేందుకు..
ఎంత కవితా  సారాయి తాగాలో?,
గుండె బరువును దించుకునేందుకు.....

కాలానుభూతిని పంచుకోవడానికి ప్రేమికునిగా మారాను..
నన్ను పలకరిం చె నీ చూపుల భాషకై అక్షరంగ మారాను..
ప్రతి అక్షరం గుండెకు అంకితంచేసుకుంటూ,
ఆగమాన్ని ఆహ్వానిస్తున్నా..
కాలాన్ని నీకోసమే నిలుపుతున్నా..
కాలాన్ని నీకోసమే నిలుపుతున్నా..

ఎలా బ్రతికేది..


నా రక్తంగ,
నీ తీపి గుర్తులు ప్రవహిస్తుటే,
నేను ఎలా నిన్ను మరిచేది..

నా కన్నుల్లో,
నీ రూపం పడు ఈదుతుంటే,
నిన్నేలా నేను చూడకుండ ఉండేది..

నా ఆలోచనలతో,
నువ్వు నిత్యం ఆడుకుటుంటే,
నేను ఎలా నీతో మాట్లాడకుండ ఉండేది..

నా గుండె గూటిలో,
ప్రేమగ నువ్వు నిద్రిస్తుంటే,
నిన్నేలా ప్రేమించకపోయెది..

ఈ శూన్యమంత నిండి,
నన్ను కవ్విస్తుంటే,
నిన్నేలా నేను తాకకుండ ఉండేది..

నా ఊపిరై,
నువ్వు నా హృదయ  వీధుల్లో తిరుగుతుంటే,
నిన్నేలా నేను ఆరాధించకుండ ఉండేది..

నా రూపమై,
నన్ను నడిపిస్తుటే,
నీకేలా నేను దూరమయ్యేది..
నిన్ను తప్పించుకొని ఎలా తిరిగేది...???
                              ఎలా బ్రతికేది...???


పిలుస్తూ.. తలుస్తూ.. కొలుస్తూ..



ప్రేమను ప్రేమించె సహృదయుడిగా ,
ప్రేమను ద్వేషించె ప్రేమికుడిగ,
రగిలిపోతు మిగిలిపోతా....
పగిలిన  హృదయంగా,
జారిన కన్నీరుగా,
మారిన దుఖానిగా,
అవతరించిన నిరాశగా,
మనసులేని శిలగా,
ఎడారిలో ఇసుక రేణువుగా,
నదిలో రాయిగా,
వాడిపోతున్న పువ్వుగా,
పారిపోతున్న నవ్వుగా,
మౌన భాషగా,
తీరని ఘోషగా,
మమతలేని మ్రానుగా,
నీవే ధ్యాసగా,
నిన్నే  పిలుస్తూ..
తలుస్తూ..
కొలుస్తూ..
కన్నుల నిండ కన్నీళ్ళను మోస్తూ..
చస్తూ బ్రతుకుతూ..

అధికారముంటుందా.?????


నిన్ను కలుసుకున్న కలయిక,
నాలో పుట్టిన ప్రేమ మొలక,
గతమే అయిన విగతం కానిది..
మాయే అయిన మానిపోనిది..
కలే అయిన కరిగి పోనిది..

జీవితపు అంచున నిలబడి,
ఓటమిని చూసి నా అంతరాత్మ నవ్వుతుంటే,
కన్నీటి తరంగాలే నాలొ మొదలవుతాయి..
ఎన్నటికి తగ్గని వేదనలే జనిస్తాయి..

కనురెప్ప కింద నువ్వు కొలువైఉండీ,
నీ సుకుమార హస్తాలతో నన్నెప్పుడు బాధిస్తుంటే,
రుధిర బాష్పాలు కాక కన్నీలొస్తాయా.?
కనులు నిన్ను కాక లోకాన్ని చూస్తాయా.?

నా అనుభూతి గ్రంథానికి కర్తవు నీవై..
నా కన్నీల్లను సిరగ మార్చి,
ఒక్కొక్క అక్షరం కష్టాలా నిలయంగ చెక్కితే,
ఆనదాలకు చోటుంటుందా.?
చిరునవ్వులకు స్థానముంటుందా.?
నా జీవితంపై నాకు అధికారముంటుందా.?????
                            అధికారముంటుందా.?????

అందుకే..




వెలుగు సూర్యున్ని అసహ్యించుకుంది,,
అందుకే..
ఈ లోకమంత చీకటిమయమయ్యింది...

కాలం ప్రకృతిని  చీదరించుకుంది,,
అందుకే..
ఈ శూన్యమంత ఎడారయ్యిది...

ప్రేమ నన్ను ద్వేషించింది,,
అందుకే..
నా దేహమంత కన్నీళ్ళ నిలయమయింది...

ఎందుకనీ....


ఓ మనసా..!!!
నన్ను,
నా హృదయాన్ని  నీ ప్రేమతో జతగా మారుస్తావని,
మానసంలో ప్రేమ లోకాన్ని నిర్మించాను..
ప్రేమంటె పడదని,
నన్ను అసహ్యించుకున్నావు..
కన్నీళ్ళను పరిచయం చేసి,
నిశ్శబ్దంగ మనసులో నిలిచున్నావు..
అయినా సమ్మతమే.....


కానీ...............
నేను ఎదురైనప్పుడన్నా...
 ఓ చిన్ని నవ్వుని దానమియ్యొచ్చుగా.?
ఓ మాటైన ముఖాన పరచచ్చుగా.?
ఓ కను చూపుని పడవేయొచ్చుగా.?
నా పాదాలకు ఒక్క అడుగుని జత చేయొచ్చుగ.?

ఎందుకంత ద్వేషం..
ఎందుకంత కోపం..
నిన్ను ప్రేమించాననా.?
నిన్ను ఆరాధించాననా.?
ఎందుకనీ....

2, ఆగస్టు 2011, మంగళవారం

ఎంత చిత్రం..

ఆమె నడకను చూసి,
నా మనసు నడకలు నేర్చుకొని తన వెంటే నడుస్తుంది..

ఆమె ప్రేను అంభవించి,
నా జీవితం ప్రేమను తెలుసుకొని తన ప్రేమలో కలిసిపోయిఉంది..

ఆమె మాటలు విని,
నా మౌనం మాటలు నేర్చుకొని ఆమె మాటల్లోనె అంతమయ్యింది..

ఆమె సౌందర్యం చూసి,
నా భావం సింగారించుకొని ఆమె సౌందర్యంగ సాగిపోతుంది..

ఎంత చిత్రం..
ఆమంటే నాకెంత ఆత్రం..
కావాలి తను నా కళత్రం..
పంచాలి ప్రేమ నిత్యం..

తనదే...


ప్రేమా..!!
నీకు ఎన్నో మనసులు పరిచయమయ్యాయి కావచ్చు,
కానీ నాకు పరిచయమైన  ఒకే  ఒక్క  మనసు తనదే....

సంతోషమా..!!
ఎన్నో పెదవులు నిన్ను తాకి ఉంటాయీ,
కానీ నా పెదవులను తాకిన ఒకే ఒక్క సంతోషం తనిచ్చిందే....

స్వప్నమా..!!
నీకు ఎన్నో కన్నులు వరంగ లభించ్వ్హాయి కావచ్చు,
కానీ నా కనులను తాకిన ఒకె ఒక్క స్వప్నం తనదే....

భావమా..!!
ఎన్నో ఆలోచనలు నిన్ను ఆశ్రయించి ఉండొచ్చు,
కానీ నన్ను ఆశ్రయించిన ఒకే ఒక్క ఆలోచన తనదే....

నా హృదయం ఎప్పటికి కోరుకునే ఒకే ఒక్క
                                              చెలి తనే..
                                               ప్రేమ   తనదే..
                                              భావం  తనదే..
                                           మనసు   తనదే..
                                                         తనదే..
                                                         తనదే..
                                                         తనదే..
                                                         తనదే..

నీ ప్రేమలేక ....

నీ నడకలో ధ్వనించు కాలి గజ్జెల సంగీతానికి,
నేను ప్రణయ గీతాలు ఆలాపిస్తున్నానూ...

ప్రకాశించు నీ మోము కాంతుల్లో,
నా భవిష్యత్తు బాటను చూసుకుంటున్నానూ...

నీ పెదాలపై పూయు చిరునవ్వుల మొక్కలతో,
నా ఆరోగ్యావసర ఔషధ గుళికలు తయారుచేసుకుంటున్నానూ...

నా నుండి దూరమయ్యే నీ నడకలతో,
నా గమ్యానికై అడుగులను నేర్చుకుంటున్నానూ...

నన్ను నిందించే నీ మాటలను ఏరి,
నా హృదయ  స్పందనగ మార్చుకుంటున్నానూ...

ప్రియా..!!!
వసంతంలేక కోయిల ఉంటుంది..
నీరులేక నది ఆనవాళ్ళు ఉంటాయి..
సూర్యుడులేక సగం దివసం ప్రపంచముంటుంది.
కానీ...
నీ ప్రేమలేక నేను
క్షణం..
ఒక్క క్షణం..
అయిన జీవించలేనూ...
మనుగడ సాగించలేనూ...

నా వల్ల

ప్రాణవాయువు ఆగిన నాడు ఈ జగమే శూన్యం,
నాలో ప్రేమనేది లేని నాడు మరణమే శరణ్యం,

బాధలో కూడ సంతోషాలకై,,
నిన్ను, నీ జ్ఞాపకాల్ని  తలుచుకుంటా..

పెదాలపై చిరునవ్వు కోసం,,
నీ పేరును పిలుచుకుంటా...

గుండె బరువును దించుకొనుటకై,
ఏవో రాతలు రాసుకుంటా...

నిత్యం నీ నామస్మరణ చేసే ఈ పూజారికన్న,
వినే దేవతవైన నీకె బాధెక్కువన్నావూ...
చెలీ...
నా వల్ల నీకు క్లేశమైతే,
నా వల్ల నీకు ఖేదమైతే,
ఆపుకుంటా నా గుండె సవ్వడిని..
తీర్చుకుంటా నా మనోవ్యధని..


ఎందుకంటే....
 నీకు ,
ఒక్క కన్నీటి చుక్క నేల రాలకూడదూ..
ఒక్క క్షణం కూడా మనసు చింతించకూడదూ.. 
ఒక్క క్షణం కూడా మనసు చింతించకూడదూ.. 

ప్రేమ అనె పదం వినగానె


ప్రేమ అనె పదం వినగానె,
అద్దంలాంటి నా మనసు వేదనలతో బద్ధలవుతుంది,
అనురాగంతో చూడు సఖీ..
ప్రతి ముక్కలోను నీ రూపే నిలిచి ఉంటుంది...

ప్రేమ అనె పదం వినగానె,
మంచులాంటి మనసు వెతలతో కన్నీరుగ కకరుగుతుంది,
ఆప్యాయతతో చూడు ప్రియా..
ప్రతి కన్నీటి బొట్టులో నీ ప్రేమె నిండి ఉంటుంది...

సంతోషాల మాల..


నిన్నటి రోజు కరిగి పోయిన కల..
రేపు చేరబోయె అల..
మనరోజే ఇవ్వాళ్ళ..
విసురు చిరునవ్వులకై వల..
ఆనందంగ ఉండు అన్ని వేళల..
దరియించు సంతోషాల మాల..
చేసుకో నీ జీవితం మోద శాల..
బ్రతుకు ఆరిపోతున్న జ్వాల..
తొలిగించు హ్రుదయంలో మైల..
ఇక దుఖము ఏలా.?..

రోజు


ఈరోజు..
ఈ రాజు..
ప్రేమ అంతంచెంది,
ఆ రాజు పంతం వదిలి,
ఈ రాజును స్వంతంచేసుకోబోతున్న రోజు....
నా ఆలోచన ఆప్తులూ..
నా అనవరత ఆర్తనాదాలూ..
నా ఆశయాల ఆస్తులూ..
నా అజస్ర అస్రములూ..
నా అవిరత ఆలోడనములూ..
నా ఆలోక ఆనందములూ..
నా అవిరళ ఆవేదనములూ..
పరిసమాప్తియై,
పరలోకానికి ప్రయాణమయ్యే పర్వదినం..
ఆసయము ఆరిపోయి సోక సంద్రం సాగే సమయం..
ఆత్మ కాయమును అవిముక్తం చేసి,
అందరికి ఎడబాటయ్యే రోజు,
జీవతానికి అవధి రోజూ..
ప్రేమకి సమాధి రోజూ..

ఆశావిహంగాలూ.....


ప్రియా..!!!!
వేగంగ వీచే గాలికి మొక్క వంగినట్లు,
నీ ప్రేమ గాలికి నా మనసు కుంగిపోతుంది..

ప్రతి చినుకు చినుకు కలిసి ధారగ ప్రవహించినట్లు,
ఒక్కొక్క బాధకలిసి కన్నీటి వెల్లువై నా గుండేల్లోంచి ప్రవహిస్తుంది..

కనబడలేదా.??  
నా లోకమా..!!!
నీ చేతి స్వర్శకై ఎదురుచూసె ఆ భాస్పధారల జాడలూ.....

వినిపించలేదా.??
నా ఆయువా..!!!
ప్రతి క్షణం శబ్దించె నా హ్రుదయస్పందనగ మారిన వెతలూ.....

అగుపించలేదా.??
నా ప్రాణమా..!!!
నీ కోసమె ఆలోచిస్తు కోరితెచ్చుకుంటున్న ముఖంలోని మౌనరేఖలూ.....
వేరే చెట్టుకై అన్వేషిస్తు రెక్కలోచ్చి ఎగిరిపోయిన నా ఆశావిహంగాలూ.....
నీ దర్శన భాగ్యం వల్ల ఆనందిస్తున్న ,
కన్నీళ్ళకు నిలయమైన నా నయనాలు.....
నీ మాటలు వింటున్నంతసేపు అప్పటి కొరకు దరహాసమును అప్పుతెచ్చుకుంటున్న నా పెదాలూ.....

చేరదియ్యలేవా.??
నా సర్వస్వమా..!!!
నీ ప్రేమకై తపించిపోతున్న ,
నీ జతకై ఆరాటపడిపోతున్న,
అనాథలైన ...
              నా మనసునీ.....
              నా వయసునీ.....
              నా స్నేహమా..!!!
              నా శాపమా..!!!
              నా మరణమా..!!!!!!!!!

1, ఆగస్టు 2011, సోమవారం

కనులు తెరిస్తే.. మూస్తే...

కనులు తెరిస్తె తన రూపం ప్రతిపూట, ప్రతిచోట ప్రత్యక్షమై
నన్ను,నా ఒంటరితనాన్ని
గుర్తుకుతెస్తు, బాధిస్తు తను హాయిగ చలిస్తు ఉంటుంది...
కనులు మూస్తె ఆలోచనై కలై వచ్చి తన ఙ్నాపకాలను ఇస్తు,
నా దురద్రుస్టాన్ని స్మరనకు తెస్తు దు:ఖింపజేస్తుంది..
ఎందుకో నాకు ఇంత ఖేదం ..
నన్ను తనల మార్చాలనొ?
త్వరగ కడతేర్చాలనో?
చెలి లేని లోకంలోకి చేర్చాలనో?????
ఎందుకో?????
మరెందుకో?????????

కమలిని..

తపించిపోతున్న తీరానికి నీటిని అందించిన అలల,
గుండెలోని భావాలకు అక్షరాలను అందించిన హ్రాదని.....
నిర్మలం చేసింది నా హ్రుదిని....

మోడై బోసిపోతున్న హ్రుక్షానైకి పుష్పాలను అలంకరించిన గ్రీష్మంల,
రాత్రిలో నిస్సారంగ సాగుతున్న కనులకు కమనీయ కలలను ప్రసాదించిన కమలిని..
రంగులమయం చేసింది నా జ్జీవతాన్ని..


అంధకారంలో అలమటిస్తున్న రాత్రికి వెన్నెల సోభను కలిగించిన పున్నమిలా,
మోడైన నా పెదాలకు నవ్వుల్ని అందించిన పార్వతి..
అందంగ మార్చింది నా మోముని............   

కవితా ఓ కవితా....

మాటల్లొ పొంగగ పుప్పొడులు,
తీర్చావు గుండెల్లోని అలజడులు,
అనంత ఆలోచనలు కలిగించిన,
అంతులేని ఆనందాలు అందించిన,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,

రప్పించి ఙ్నానమబ్బులు,
కురిపించి భావ జల్లులు,
అణువణువు అక్షర కుసుమాలు పూయించిన,
ఎన్నో కావ్యమాలలు అల్లించిన,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,

కర్షకుల చెమటలో నిండి,,
భావుకుల విరహాలతో మండి,,
దింగంబరుల దిగులును పిండి,,
స్త్రీవాదుల చింతలతో ఉండి,,
నయగారుల నాట్యాలతో సాంప్రదాయ సాహిత్యానికి పెట్టి గండి,,
దలిత కవుల దండోరగ మారి,,
నవ్య కవిత్వం స్రుష్టించిన,,
ప్రక్రుతి సమస్తం స్రుజించిన,,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,


నిర్మించి మహా కావ్యాలు,
పండించి పుష్కల పురాణాలు,
అందించి అద్భుత ఐతిహ్యాలు,
సాహిత్యలోకం సుసంపన్నం చేసినా,
ప్రతి అంగుళం పరిమలం నింపినా,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,


ఎందరికో ఇప్పించి డాక్టరేట్లు,
ఎందరికో తెప్పించి ఙ్నానపీఠాలు,
ఎందరికో  చూపించి సన్మార్గాలు,
ఉన్నత స్థానాలు ఇచ్చినా,,
కీర్తితో స్నానాలు చేయించినా,,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,,,,
          ప్రసాదించు చక్కని భవితా,,,,,,,,,,,
   

ఓ కవిత్వం....

బాధ ఆశ్రయించిన వేళ,
రోధ వెల్లువిరిసిన వేళ,
మనస్సే మౌనమైన వేళ,
శిరస్సే ఆలోచనైన వేళ,
హ్రుదయం ఉప్పొంగె వేళ,
ఉదయాన ధుఖించిన వేళ,
ప్రక్రుతి ఆహ్లాదించిన వేళ,
నయనం ఆశ్రువైన వేళ,
పయనం ఒంటరైన వేళ,
సంతోషం నేనైన వేళ,
పారితోషికం అనుభూతైన వేళ,
కాలం కరునించని వేళ,
గాలం ఓ సంఘటైన వేళ,
మౌనం కొలువైన వేళ,
ప్రాణం  అల్లాడుతున్న వేళ,,,,


"""నాలోని భావాలు,
నాలోని ఆలోచనలు,
అక్షరరూపమై,
నా సర్వాస్వాన్ని,
తనుగా మార్చుకొని,
కాగితంపై కొలువుంటాయి..
కన్నీటి బిందువులుగా తీర్చబడుతాయి.."""

నిజమైన నేస్తాలు...

ప్రేమలే కరువైన వేళ,
ఆప్యాయతలే అందని
బంధాలే తెగిన
గుండె బరువైన
మనసు చెదిరిన
హాస్యాలే కన్నీటిని తెప్పిస్తాయి..
కూలర్లే చెమటను పుట్టిస్తాయి..
ఆప్యాయతలే ద్వేషాల్ని పంచుతాయి..
మౌనాలే బాధల్ని వ్యక్తపరుస్తాయి.
బాధలే ఓదార్పునిస్తాయి..
ఆలోచనలే హ్రుదయ స్పందనను ఆపుతాయి..
స్మశానాలే ఆశ్రయాలవుతాయి..
కట్టెలే సహచరులవుతాయి.

నా గమ్యం..

ప్రతిక్షణం విఙ్ఞానం కోసమై,,
ప్రతి అడుగు గమ్యం కోసమై..
ఇష్టంతో కష్టంగ శ్రమిస్తా,
ఏనాటికైన నేననుకున్నది సాధిస్తా..

నేను కాదు ప్రతిభావంతున్ని,,,
                 ధనవంతున్ని...
శ్రమతో నేను ప్రతిభావంతున్నై,,
ప్రతిభే నాకు ధనమై,
ప్రతిభతో ప్రయత్నిస్తా,
ఫలాన్ని ఆకాంక్షిస్తా...

సాధిస్తే గౌరవం,
లేదంతే అవమానం,
అణుక్షనం ఆరాటం,
గమ్యం కోసమే పోరాటం..


కస్టాలతో ప్రయాణం చేసి సుఖాల్ని చేరుకుట..
అఙ్ఞానంతో చెలిమిని చేస్తూ కూడ విఙ్ఞానాన్ని సంపాదిస్తా..
దురద్రుస్టంతో బ్రతుకుతు అద్రుస్టనిధిని సాధిస్తా..
స్వప్నాలతో శయనించి మెల్లుకువలో నిజాలుగ మారుస్తా..
దుఖపు కన్నీల్లను ఆనంద భాష్పాలుగ ఆవిష్కరిస్తా..

ఆలోచనే ఆయుధంగ అక్షరాక్షరం శోదిస్తా,
ఆలోచనల్ని కవిత్వం చేసి నా భావాల్ని వివరిస్తా,
బ్రతుకులో మరనిస్తా,
మరనించి కూడా జీవిస్తా.
ఏనాటికైన నేననుకున్నది సాధిస్తా.
దాని కోసమే ప్రతి క్షనం శ్రమిస్తా....
దాని కోసమే ప్రతి క్షనం శ్రమిస్తా....
 నా గమ్యం..

బ్రతుకు..చావు..

ప్రేమా బంధమా..!!!!!
జీవంచడానికి జీవతమూ ఉంది,
చచ్చేందుకు మరణమూ ఉంది,
కాని బ్రతుకు, చావుల మధ్య సంతోషంగ ఉండేందుకు,
నీ ప్రేమ  లేదే నాకు...

చిన్న చిన్న సంతోషాలున్నాయి,
దుఖాన్ని పారించే బాధలూ ఉన్నాయి,
కాని బాధల్ని కూడా సంతోషాలుగ మార్చేందుక్,
నీ అనురాగం  లేదే నాకు..

నిద్రనిండ కలులున్నాయి,
మెలుకువలో నిజాలూ ఉన్నాయి,
కాని కలల్ని కూడా నిజాలుగ చేసెందుకు,
నీ తోడు లేదే నాకు...

నా బ్రతుక్కు ఆరోగ్యము ఉంది,
అనారోగ్యమూ ఉంది,
అనారోగ్యాన్ని ఆరోగ్యంగ మార్చేందుకు,
నీ సాహచర్యం లేదే నాకు...

నాకు దుఖపు కన్నీల్లున్నయి,
ఆనంద భాష్పాలూ ఉన్నాయి,
కాని కన్నీల్లను పన్నీరుగ మార్చేందుకు,
నీతో గడుపిన తీపి ఙ్ఞాపకాలు లేవే నాకు...

అంతంవైపు....

ఆశల్ని మూటగట్టుకోని,
ఆనందాన్ని ఆప్తులకిచుకొని,
ఙ్ఞాపకాల్ని గాయాలుగ చేసుకొని,
ఆప్యాయతలు తెంచుకొని,
ప్రేమను మనసత నింపుకొని,
సాగుతుంది ప్రయాణం..
               మ్రుతివైపూ,,
               చితివైపూ,.
               కలతల,
               కస్టాల,
               కన్నీల,
                అంతం వైపూ......

27, జులై 2011, బుధవారం

!!!! కాలంపై సమాధి !!!!


ఏ అనుభవం అందించకుండానే కాలం గతమయ్యింది.
ఒక్క మాటైన మాట్లాడకుండ క్షనం దూరమయ్యింది.
ప్రియా..
నేను బ్రతికున్నందుకు నీ ఆనందలోకంలోకి ఆదరించలేదు.
నాలో నీపై మమకారమున్నందుకు నీ ప్రేమ గ్రామంలో అంటరానివాన్ని చేసావు.
నేను మనసిచ్చినందుకు  నీ మాటల వాడ నుండి వెలివేసావు.
ఓ అందని తీరమా..!!!
 హ్రుదయంలో నువ్వంటించిన విరహకుంపటిని చల్లర్చేందుకు,
కొన్ని సంవత్సరాలుగ కన్నీల్లను చల్లుతూనే ఉన్నాను.
నువ్వు పడేసినా ధుఖపు సంద్రం నుండి తీరాన్ని చేరేందుకు,
కొన్ని యుగాలుగ ఈదుతునే ఉన్నాను.
ఏరి కోరి నిన్ను చేరిన ఆనందానికి కాలంపై సమాధి కట్టావు.
నిన్ను ప్రేమతో పలకరించిన నా మనసుకు ద్వేషంపై చితిని పేర్చావు.
నన్ను ఎండ తగిలే మంచులా మార్చావు.
గాలి తగిలె మబ్బుల మిగిల్చావు............

ప్రేమంటే.....

 ప్రేమంటే..
 చంద్రునికి కట్టిన వెన్నేల ఉయ్యాలలో ఊగిసలాడుతు ఇద్దరు ఏకంతాన్ని నిశ్శబ్ధంగ అనుభవించడమే, 
 ప్రేమంటే.. 
 జంట పక్షులై ప్రక్రుతి కొమ్మపై కూర్చోని కనుచూపులతో మాట్లాడుకోవడమే,
  ప్రేమంటే..
  క్షణాల్ని వెంటనడుపుకుంటు కాలానికి ఙ్నాపకాల అమ్రుతాన్ని పంచడమే,
  ప్రేమంటే..
  దు:ఖాల్ని దగ్ధంచేసి సంతోషాల్ని స్వాగతించడమే,
   ప్రేమంటే..
   గాలి గ్రుహంలో  ఉంటూ మౌనాల్ని మాటలుగ మాటలుగ మార్చడమే,
    ప్రేమంటే..
    కనులను జతగా మార్చి చీకటికి కలల హారాన్ని బహుకరించడమే,
     ప్రేమంటే..
     బావిలొ మునిగిపోతున్న ఆశల చేపల్ని కోరికల వలలతో బంధించడమే, 
      ప్రేమంటే..
     మానస దేవాలయంలో అనురాగ రూపాన్ని తరగని ఇస్టంతో నెలకొల్పడమే,
     ప్రేమంటే..
     ప్రకృతంత  మమకారాన్ని నింపుకొని భవిష్యత్తును హరివిల్లుగ మార్చుకోవడమే,
     ప్రేమంటే..
      ద్వైతమైన మనస్సులను అద్వైతం చేసి చివరి వరకు చీకటి, వెలుగులను కలిసి పంచుకోవడమే,,,,,



                            """""       ప్రేమంటే..... 
                                     తరగని నిధి.....
                                 హ్రుదిని శసించే విధి....
                                దాసోహం ప్రతి మది.....
                                  ప్రేమ కానిది ఏది.....    """"" 

అమ్మా..!!!! ఎందుకమ్మా..!!!!


            అమ్మా..!!!!
  అలసిపోయచ్చిన నేను సేదతీరేందుకు నీ భుజం ఎక్కడమ్మా..??
  బాధ పడిపడి కుంగిపోతున్న నన్ను ఓదార్చేందుకు నీ కమ్మని పలుకు ఎక్కడమ్మా.??
  వేదనలతో కన్నీరుగ కరిగిపోతున్న నా భాష్పాలను తుడిచే నీ అమ్రుత హస్తం  ఎక్కడమ్మా.??
  మన:తాపం కలచివేస్తున్నప్పుడు నన్నాదరించె  నీ స్వర్గపు ఒడి  ఎక్కడమ్మా.??
  క్షణ  కాలం కనబడకపోతే కన్నా, చిట్టి అని పిలిచే నీ మధుర గానం ఎక్కడమ్మా.??
   బాధైనా, సంతొషమైన,
 సుఖమైనా,దుఖమైనా  చెప్పుకునేందుకు  అమ్మా నీ మనసు ఎక్కడమ్మా.??


  అమ్మా..అమ్మా..       అని తలచుకొని ఆనందించమని అనంతలోకానికి నువ్వెళ్ళిపోయావు...
  అనంత శోకాలను నాకు మిగిల్చి.ఎందుకమ్మా నన్ను వదిలెల్లావు..
  నీ వెంట నాన్నూ తీసుకువెళ్ళుంటే నీ ప్రేమను అనుభవించేవన్ని కదా..
  అమ్మ తనాన్ని ఆస్వాదించేవన్ని కదా..
  అమ్మ పదమే మిగిల్చి నువ్వు దూరమయ్యావు..
  నన్ను అనాథను చేసి...
  ఓ గాథగ మార్చి..

మారని కథ....!!!!


 ఓ లోకమాతా!!!!
 ఒకప్పుడు నువ్వు------
 సాంప్రదయపు  సంకెళ్ళతో  వంటింట్లొ బంధింపబడి మూగబోయిన గ్రుహలక్ష్మివి.!!!
 పేదరికపు అంగట్లో ధనవంతులు,రేపో-మాపో  రాలిపోయె వ్రుద్దులు కొనుకున్నే   పుత్తడిబొమ్మవి.!!!
 బాల్య వివహాల బాసికాలతొ చిన్నతనంలోనె ఉరితీయబడ్డ బంగారు భవిషత్తువి.!!!
 సతిసహగమన యాగపు మంటల్లొ కాలిపోయిన చిగురించే కొమ్మవి.!!!
 కట్టుబాట్ల కాలంలో,
 మూఢనమ్మకాల సమయంలో,
 స్వేచా విహీనురాలివై,
 అస్వతంత్రరాలివై,
 అడుగడుగు ఆంక్షల మేకులు గుచ్చుకొని రక్తాశ్రువులను దారపోసిన సహనశీలివి.!!!
 ఆచారాల ఆయుధాలతో అంతంచేయబడ్డ దేవతవి.!!!
 కష్టాల బాటలో,
 కన్నీళ్ళ మూటలతో ప్రయానంచేసినా నీ వారికి ఆనందాన్ని ఒసగే కల్పవల్లివి.!!!
 చలం ఆత్మీయ బంధువివి.!!
 కందుకూరి పోరాటనివివి.!!!
 భావకవుల హ్రుదయేశ్వరిగ ,
 ఆరాధ్య దేవతగ కీర్తించబడి,
 స్త్రీవాదంలో శిఖరాయమాన స్థానాన్ని పొందిన భాగ్యశీలివి.!!!
 చరిత్ర గతుల్నే మార్చేసిన శ్రమజీవివి.!!!



               ఇప్పుడూ............
 ప్రేమోన్మాధుల చేతుల్లో రాలిపోతున్న సుకుమార పుష్పానివి.!!!
 ధనాశగల రాబందుల రెక్కల గాలికి ఆరిపోతున్న దీపానివి.!!!
 మదోన్మత్తుల కటినపు కౌగిట్లో గాయపడుతున్న కోమలివి.!!!
 ప్రేమకు నిలయానివివి.!!!
 త్యాగానికి  మరోరూపానివి.!!!
        అయినా
       ఆనాటికి..
       ఈనాటికి..
    మారని కథవి..

ప్రశ్నించు...


కారే ప్రతి కన్నీటి బొట్టుకు,
కాలాన్ని బంధించు.
దేనికని ప్రశ్నించు .
నీవు చూపె తెగువకు
నీకు కలిగిన కొదువకు
ఆపుడే................
సంతోషాల గడియల్లో ఆనందాల ఆస్తులు లభించేది.....
           కలిగే ప్రతి దు:ఖానికి
సమయాన్ని శిక్షించు,
ఎందుకని ప్రశ్నించు,
నీవు చూపే నేర్ప్తుతో ..
నీవు చూపే ధైర్యంతో..
అప్పుడే...............
హార్షాల క్షణాలు ఎదురస్తాయి..
మోదాల పువ్వుల్ని పూయిస్తాయి..

రు ధిర భాష్పాలు....


 ఆమె కనుపాపల్లొ నన్నొక్క సారి చూసుకొని మురిసిపోవాలని ఉంది,
   నిత్యం నాపై కోపాన్నే కురిపించే చెలి
   నావైపు కన్నులను మరల్చదే..
   ఏవిధంగ నా రూపాన్ని ఆమె నయనాల్లో చిత్రించి తనివితీర సంతోసించాలి.
               ఆమె పలుకుల్లో నా పేరు ఒకసారి పిలుపించుకొని,
               మోక్షాన్ని పొందాలని ఉంది,,,
               నిత్యం నాను ద్వేషించే దేవత
               నా పేరు పలుకదే
               ఏవిధంగ చిత్రించి ముక్తున్ని కావాలి......
               ఏవిధంగ ఆమె పలుకులు నా పేరుగ రూపు దిద్దుకొని
               నా మనసును శాంతింపచేసుకోవాలి....
                  ప్రియబాంధవి..

    నను కరునించి-------- కనులు  కన్నీల్లను కారుస్తున్నాయి..
                      మనసు రుధిర భాష్పాలను జారవిడుస్తుంది.



                  కానీ ....
                    నీవెందుకే సఖీ
                     నను కరునిచవు ....
                       నా మనసును ఆదరించవు.....

భావకవీశ్వరుడు....


 పిఠాపురం దగ్గర జన్మించి,
        మా మనసులో పీఠం వేసి,
        మాకు గురుపీఠమైన ఓ భావకవీశ్వరా!
        సాగుతున్న సాంప్రదాయ రచనా విధానాల్ని,
        నీ కవిత ధోరణితొ రూపుమాపి..
        ఓ  కొత్త భావాన్ని ఈ జగత్తుకందించావా!!
        ఓ గంధర్వ గీతమా!!
        మీ బ్రతుకులో అలుముకొన్న క్రుష్నమునె మాకు "క్రుష్ణపక్షము"గ  మాకందించి,
        మీ జీవితంలొ ప్రవేశించిన స్త్రీనే మాకు "ఊర్వశి"గ  పరిచయంచేసి,
        మీ జీవితంలొ కలిగిన బాధా ప్రవాహములను "ప్రహసనము"గ  పలికించి,
        "యమునా విహారివై",
        "ఏడాదిపొడుగున" కస్టాల నిధివై,
        మీ "గౌతమిని",
        "పల్లకి"లో,
        "ఋగ్వీథి " ద్వార మోసుకస్తు,
        "మహతితొ",
        "పద్యావళి"ని  ఆలపించి,
        "సిన గీతాలు"గా," లలిత గీతాలు"గా,
        మా హ్రుదయంలొ ప్రవేశించావా ఓ పాటల పరమేస్వరుడా!!!!!
        మీ మదినుండి వెలువడిన అచ్చమైన ఆ భావకవిత్వం,
         ప్రక్రుతికి శోభాయమానముగ కోయిలకు చిగురుల ఋతువును వికసింపజేస్తుంది...
        వసంత ఋతువును అందింపజేస్తుంది...
        మీ భావకవిత్వ గీతాల్లో ప్రక్రుతి పండుగ చేసుకోవాలి ,
        మదిలో భావం వికసించాలి                                                                            విరుల తోటను ఈ జగత్తుకందించి,
     ప్రపంచమంత భావ కవిత్వ పరిమళాలు వెదజల్లారు  ,
       ప్రక్రుతి అణువణువులో మీ గానం,
                      మీ భావం,
                      మీ రూపం,
        ఉంటూనే ఉంటుంది......
        ఈ ప్రక్రుతున్నంత వరకు...
        మనషికి మనసున్నంత వరకు.
        ఆంధ్రషెల్లిగా కీర్తించబడ్డ ఓ భావుకత పట్టబద్రుడా,,,,
        మీ భావుకత్వానికి..
        మీ ప్రేమతత్వానికి..
        మీ కివే నా ప్రేమాభివందనాలు............

అక్షర వర్షం..

                                                                                                                                                              బాధల మబ్బు నన్ను ముసురుకున్నప్పుడు
కన్నీటి వర్షం పడకతప్పదు..
అంతరంగంలో ఉప్పెన రాకమానదు..
ఆలొచనలో తుఫాను కలుగకమానదు..
అప్పుడు ఒక్కొక్క చినుకు అక్షరమై పేజీలను తడపకమానదు..

కనులు తెరిస్తే.. మూస్తే...

కనులు తెరిస్తె తన రూపం ప్రతిపూట, ప్రతిచోట ప్రత్యక్షమై
నన్ను,నా ఒంటరితనాన్ని
గుర్తుకుతెస్తు, బాధిస్తు తను హాయిగ చలిస్తు ఉంటుంది...
కనులు మూస్తె ఆలోచనై కలై వచ్చి తన ఙ్నాపకాలను ఇస్తు,
నా దురద్రుస్టాన్ని స్మరనకు తెస్తు దు:ఖింపజేస్తుంది..
ఎందుకో నాకు ఇంత ఖేదం ..
నన్ను తనల మార్చాలనొ?
త్వరగ కడతేర్చాలనో?
చెలి లేని లోకంలోకి చేర్చాలనో?????
ఎందుకో?????
మరెందుకో?????????

ప్రేమ దీపం ....



   గుండెల్లొ వెలిగించిన ప్రేమ దీపానికి
                        రక్తాన్ని చమురుగ పోస్తు,
                                   ఆరిపోకుండ ఆలోచనల్ని అడ్డుగ ఉంచాను,
               నీపై అనురాగం తగ్గిన నాడు.....
                     గుండెల్లో దీపం ఆరిపోతుంది,
      నా జీవితం ముగిసిపోతుంది .............

26, జులై 2011, మంగళవారం

ముంచెత్తేది..!!!


                   నిచ్చెలి.....
నిన్ను ప్రేమించింది చూసిన ఆ ఒక్క క్షణంలోనే,
కాని దాన్ని పంచుకుంటున్నది ప్రతి క్షణంలో..
ఆ ఒక్క క్షణం ఎన్నో క్షణాల  ఆనందానికి కారణం.
దానికి కారణం నువ్వే కదా...
నన్ను ముంచెత్తేది నీ నవ్వే కదా...

మాట..తూట..


నీ తొలి మాట..
నా గుండెకు తూట..
అది కలిగించేది గాయం కాదు,,
మరువలేని ఙ్నాపకం .........

ఒకప్పుడు..ఇప్పుడు..


ఒకప్పుడు కాలం జ్ఞాపకాలను అందించింది..
కాని ఇప్పుడు ఙ్నాపకాలను పంచుకుంటుంది..........
కాలం ఎంతా విచీత్రమైనదో.........

ఒక్క క్షణమైనా..???????


గడచిన కొన్ని లక్షల క్షణాల్లొ
నా గురించి ఆలోచించింది ఒక్క క్షనమైన ఉందొ? లేదో?
నేను..........
నా మేను.............
నువ్వే అయ్యాకా నా గురించి ఆలొచించడం ఉంటుందా?
కన్నులు నా కోసం కల కంటుందా???????

నిరాకరణ రాయి.


చెలి...
నీ నిరాకరణ రాయి తగిలి అద్దమైన నా మానసము ముక్కలు ముక్కలు అయ్యింది.
ఋణంగ తెచ్చుకున్న చిరునవ్వుల పెవికోల్తొ అంటించుకుంటున్న ,
హ్రుదయము కార్చె రక్తాశ్రువులకు అంటుకొవడంలేదు.
అయిన ఓ కవి చెప్పాడుగా "మనసు విరిగితె అతకదని"
నేనెంత పిచివాన్ని ప్రయత్నిస్తున్నా......
ఇకపై నా మనసు అతికేది చెలి నువ్వు తెచ్చె ప్రెమతోనే..

కదలని శిలలు..!!!!


కలలను కన్న కనులకు కన్నీళ్ళే మిగిలాయి.
కలలు కదలని శిలలై చీకటి సామ్రాజ్యంలోనె బంధీ అయ్యాయి.
కలలు బాధా అలలై గుండెల్లొ ఉప్పొంగుతూనె ఉన్నాయి.
అయిన నయనము ఎందుకో ఆపడంలేదు కలలు కనడం.
ఖేదంలొ కూడ చిన్న మోదం దొరుకుతుందేమోనని,,,
ఎందుకో ఆ పిచ్చి ఆశా!
అందమైన శిలను ఎంత ప్రేమిస్తే ఎంటీ,
దానికి మనసు రాదు ...
కలకు మోదం దొరకదు ......

కడలిగ మారిన కాలం....


నీ ఎడబాటుతొ కన్నీళ్ళు కారి కారి కడలిగ మారిన ఈ కాలాన్ని ఎలా దాటాలి?
నువ్వు చేయ్యందిస్తావంటే ఏనాడో దూరమయ్యావు.
ఆశా తెప్పతొ దాటుదామనుకుంటె నీరాశగా  మార్చేసావు.
ఇకా ప్రెమ తాటికి ఉరేసుకుంటా!
జ్ఞాపకాల  కిరోసిన్ పోసుకొని ద్వేషాగ్నిని అంటించుకుంటా!
దు:ఖపు కత్తితో హ్రుదయంపై పొడుచుకుంటా1
బధా కొండపై నుండి దూకుతా!
ఎడబాటు అగాధంలొ కూరుకుపోతా!
క్యాలండర్లొ నిలిచిపొతా!

అందమైన ఆనంద లోకం..


ఆమె నాకు ఒక అందమైన ఆనంద లోకాన్ని పరిచయంచేసిది,
కన్న కలలన్నింటిని వెంట తెచ్చి కానుకగ ఇచ్చింది.
కష్టంగ కదిలె కాలాన్ని సంతొషాల మేడగా నిర్మించింది,
కాని ఇప్పుడు ఆ లోకంలొ నన్ను ఒంటరిగ వదిలెల్లింది,
నిజాల్ని కలలుగ మార్చి ,
మనసును శిలగ మిగిల్చి,
ఇప్పుడు ఒక్కన్నె ఆ లోకంలొ
ఆమె ఆలొకంలొ విషాద కావ్యంగ సాగాలెమో,
కన్నేళ్ళనె తాగలేమో...........

ఒకటి...మరొకటి....


ప్రేమైన, ద్వేషమైన గుండెల్లోనె పుడుతుంది,
మనసంత ఆక్రమిస్తుంది.ఒకటి ప్రతి చోట చిరునవ్వుల్ని చిందిస్తె,
మరొకటి అంతులేని ధుఖాన్ని పండిస్తుంది.
ఒకటి లొకమంత రసమయంగ చేస్తె,
మరొకటి శోకమె సర్వస్వంగ మారుస్తుంది.
ఒకటి జీవిత ప్రస్థానాన్ని పూలమయం చేస్తె,
మరొకటి ముండ్లపై నడకను నేర్పుతుంది.
క్షణాల్ని ఇక్షురసంగ అందిస్తె,
మరొకటి వేపరసంగ మారుస్తుంది.
ఒకటి జీవితాన్నిస్తె,
మరొకటి అంతం చేస్తుంది..........

బాధల బండి..


చావునీకైన, నాకైన విడిపోయేది మన ప్రెమ బంధమే,
కాని అంతలొపే నా మన్సును చమంపేస్తె ఎల సఖీ.....
ఇన్నాళ్ళు నీతో సాగిన నా పాదాల్ని ఒంటరిగ మార్చెస్తావా?
నీ ప్రెమను పొందిన క్షణాల్ని అనాదలను చెస్తావా?
నీ పేరొను జపించిన నా మాటల్ని మౌనంగ మారుస్తావా?
నీ చుట్టే తిరిగిన నా ఆలొచనల్ని సూన్యంలొ కలిపేస్తావా?
నా గుండె సవ్వడితొ జత కట్టిన నీ శ్వాస వీడిపోతుంటే,
నిన్ను నిలుపుకొన్న నా హ్రుదయ గుడిగంటలు మూగబోవా?
నా చూపులను ముద్దాడిన నీ చూపులు విడిపోయాయంటె,
లోకమంత నీ మయం కాదా?  
ఎప్పుడు నా పెదవులను స్పర్శించె నీ చిరునవ్వుల హస్తం కరువయ్యిందంటె,
బాధల బండిగ జీవితం మారదా?
కన్నీళ్ళుగ కరిగి కడలిలొ కలిసిపోనా???????
గరిగె.రాజెష్  

నిరంతర బాధగా.....


వాత్సల్యం పొందని నేను
ప్రేమనే బాధాలోకంలో
ఆమె ఆలోచన ఆస్తుల్ని పొంది
జ్ఞాపకాలను తింటూ
కన్నీళ్లను తాగుతూ
నిరంతరం భారంగా సాగిపోతా
ఆనందానికి దూరంగా ఉండిపోతా..............
రాజేష్.జి

గాయాలూ.. గేయాలూ.


జ్ఞాపకాల హస్తాలు
నా హృదయ వీణను మీటుతూ
నా చెలి సాహచర్యంలో అనుభవించిన క్షణాల్ని
అక్షరాలుగా మార్చి,
పదాలుగా కూర్చి,
మౌనంగా నా అంతరంగంలో పాడుకుంటున్నాయి,
నా జీవిత గాయాలను గేయాలను నిర్మించుకొని,
నా తలపుకు తాకిన తూటాలను పాటలుగా అల్లుకొని........................
రాజేష్. జి

అలంకరిస్తా...........

భావాలు అలలై మనసును ముంచేస్తుంటె,  
ఆలోచనలు సుడిగాలులై మెదడును చుట్టెస్తుంటె 
చేజారినా మమకారంకోసం మనసుతో వెతుకులాట 
క్షణాలతో కొట్లాట, 
దూరం మౌనాన్ని ఇస్తె మౌనంపై మొలిచిన పలుకులతొ చెబుతున్నా 
"నేను నిన్ను ప్రెమిస్తున్నాన్ననని" 
"నన్ను నేను వదిలేసుకుంటున్నానని"
సఖీ....  
నాపై కోపమస్తె ప్రేమతొ తిసివేయ్, 
కాని నాపై ప్రేమను కాదు,
గతించిన కాలాన్ని తేలేను,
రాబోయే కాలాన్ని తేలేను,
కానీ నడుస్తున్న కాలాన్ని ఆనందంగ అందిస్తా, 
చిరునవ్వుల తొటగ పూయిస్తా, 
అదరాలపై అలంకరిస్తా.......... 
గరిగె.రాజెష్...

23, జూన్ 2011, గురువారం

నిరంతర భారంగా....

వాత్సల్యం పొందని నేను
ప్రేమనే బాధాలోకంలో
ఆమె ఆలోచన ఆస్తుల్ని పొంది
జ్ఞాపకాలను తింటూ
కన్నీళ్లను తాగుతూ
నిరంతరం భారంగా సాగిపోతా
ఆనందానికి దూరంగా ఉండిపోతా..............
రాజేష్.జి
జ్ఞాపకాల హస్తాలు
నా హృదయ వీణను మీటుతూ
నా చెలి సాహచర్యంలో అనుభవించిన క్షణాల్ని
అక్షరాలుగా మార్చి,
పదాలుగా కూర్చి,
మౌనంగా నా అంతరంగంలో పాడుకుంటున్నాయి,
నా జీవిత గాయాలను గేయాలను నిర్మించుకొని,
నా తలపుకు తాకిన తూటాలను పాటలుగా అల్లుకొని........................
రాజేష్. జి

28, ఏప్రిల్ 2011, గురువారం

చిరునవ్వుల పువ్వులు......

సఖీ!!!!
నీకోసం ఎన్నో చిరునవ్వులపువ్వుల్ని నా పెదవుల వ్రుక్షమునుండి చిదిమేసాను ,,
నీకోసం ఎన్నో సంతోషపు పత్రాల్ని హృదయ పద్మం నుండి విరిచేసాను ,,,
నీకోసం ఆశల అమృతాన్ని జీవిత సముద్రం నుండి వేరుచేసాను ,,,
నీకోసం మాటల తేనేల్ని మౌనపు తుమ్మెదలకు దారపోసాను ,,,
నీకోసం మనసు మంచు ముక్కను విరహాగ్నితో కన్నీల్లుగా కరిగించాను ,,,
నీకోసం కలల తారల్ని నిద్రాకాశం నుండి తెంపివేసాను,,,
నీకోసం నా ఆణువణువూ లభించే బాధా ముత్యాలని ఏరి కవిత మాలగా అల్లుతున్నాను ,,,
నీకోసం చెక్కిలి అమ్మాయికి అశ్రువుల హారాన్ని బహుకరిస్తున్నాను ,,,
సఖీ!!!!!!!!!!!
అన్నికోల్పోయిన నాకు అన్ని ఇవ్వ కరునిచావేమే ?
కనికరించావేమే ?
రాజేష్ ౧౧౨........... 

ప్రసాదించమ్మ్మా...!!!!

అమ్మా
గుండెల్లోని బాధ పెదాలను ఎడారిగా మార్చేసింది 
రెక్కలోచిన సంతోషం తోడుకై అన్వేషిస్తూ ఎగిరిపోయింది 
నీ ఆనందాశ్రంలోకి నన్నాదరించి 
హర్ష వశాని నిరంతరం కురిపించమ్మా...
అక్షర వసంతం ఆదరించని భావ కోయిల నీవిచ్చే వరంతో గానాలాపన చేయాలనుకుంటుంది .
భావ పుష్పం కరుణించని అక్షర తుమ్మెద నీవిచ్చే అనుగ్రహంతో 
రసాన్ని జగాతుకందిన్చాలంటుంది
గాయ పడ్డ నా హృదయంలో బండి అయిన భావాలు ఎన్నో ఎన్నెన్నో 
నీ పుత్రినిగా దరికి చేర్చుకొని ప్రేమామృతాన్ని ప్రసాదిన్చమ్మ
కవనము కురిపించి కవిగా తీర్చి నీ విలువైన కౌగిలిని అందించంమా  నన్ను పునీతున్ని చేయమ్మా ...........
రాజేష్ ,,,,,,,,,,

27, ఏప్రిల్ 2011, బుధవారం

నన్ను బ్రతికించు ,,,

కన్నిల్లై సాగుతున్న సమయంల్లో 
దానిలో కొట్టుకుపోతున్న మధుర జ్ఞాపకాలెన్నో ...
మౌనమై సాగే ఈ క్షణంలో 
ఎదనిండా ఘోషించే వేదనలు ఎన్నో ..
క్షణ క్షణం నీ ప్రేమ వేడిలో రాలిపోతున్న ఆశలు ఎన్నో ..
ప్రియా ,,,,,,,
నా కళ్ళలో నిండిన ప్రేమను చూడు 
కన్నీళ్ళలో కొట్టుకు పోతున్న మన జ్ఞాపకాలకు చేయుతనివ్వు 
నా అంతరంగంలో కొలువున్న మౌనాలకు మాటలను ప్రసాదించు 
నన్ను బ్రతికించు 
నన్ను కరుణించు ...........
రాజేష్ ౧౧౨........

నీకోసమే ....

కరిగిపోతున్న ఈ క్షణం నీ ప్రేమతో ముగిసిపోని ,
జారిపోయిన నా ప్రతి క్షణం నీ జ్ఞాపకంగా మిగిలిపోని ,
దూరమైనా నా కాలం నీ చురునవ్వుగా ఉండిపోని ,
గడిచిపోయిన నా గతం నీ ప్రేమై నన్ను ముసురుకొని ,
సాగిపోతున్న ఈ సమయం నీ ఆలోచనల్ని అందిచుకోని,
రాబోయే నా అనుక్షణం నీ ఊహలతొనే కరిగిపోని ,
ఓ గాయమై నిలిచిపోని ,
కేవలం నీ కోసమే గడిచిపోని .
నన్ను నేను మరిచిపోని ,
కొత్త లోకాన్ని ఏర్పరచుకొని .............
రాజేష్ ,,,,,,,,

కవితా లోకం...

కనులను కౌగిలించోకొని కనురెప్ప కమ్మని కలలు కంటోంది ,
హృదయ వీణను మీటుతూ శ్వాస స్పందన  స్వరాల్ని పాడుకుంటోంది ,
ఆలోచన రంగ స్థలంపై భావ కన్య ఆనందంతో నర్తిస్తోంది ,
గొంతుక వీదుల్లో మౌనం పలుకులకు ద్వానుల్ని అమ్ముకుంటోంది ,
శరీర మైదానాల్లో రక్తము నరాలతో ఆడుకుంటోంది ,
కవానమే నిలయంగా జీవితం ఆనుభావాలను పంచుకుంటోంది ,
అన్నింటికీ స్థానమైనా నా దేహం 
జ్ఞాన సౌధంలో సేదతీరుతూ 
ఓ కొత్త లొకానికై కళలు కంటోంది 
ఆరాటపడుతోంది 
ఆ లోకమే " కవితా లోకం "
నేను చేరే నవీన తీరం .........
రాజేష్ ౧౧౨ ..............

అసమాన్య రత్నం..

కాలం కరిగిపోయింది పున్నమి వెన్నెలగా ...........
ఓ భావం నిలిచిపోయింది మదుర గానంలా ........
అది అక్షర రూపం తొడుక్కొని 
నా అనుభూతి గ్రంధంలో ,
నా జీవన బందంలో ,
నా కవిత సంపుటిలో ఒక బాగమై కలిసిపోయింది 
అసామాన్య రత్నమై మెరిసిపోయింది 
నన్ను నాకు చూపుతూ 
నా ఆలోచన కాంతిని అందరికి పంచుతూ ..............
రాజేష్ ౧౧౨..........

మనసు మూగదైపొతుంది ..!!!

నిన్ను చూసిన ప్రతి క్షణంలో ,
మౌనం నన్ను గెలుస్తుంటే
వసంతంలేని కోయిలలా    -- నా మనసు మూగదైపోతుంది....                                                                
ఎన్నోభావాలు నింపుకొని నీ దరికి చేరుతానా, 
ప్రేమతో నిన్ను చూస్తానా ,
నా నీడ నిన్ను తాకగానే 
నీ  ద్వేషాగ్ని చూపుల్లో నా భావాలన్నీ కాలిపోతుంటే 
నా హృదయం స్మశానంల మారుతుందీ...........
నా భావాలు అక్షర రూపం పొందేతందుకు  ఏ యాగా నేను నిర్వహించాలి ..
మన మధ్య అంటరాని తనం పోయి ఎడబాటు తగ్గేతందుకు   ఏ పవిత్ర జలంలో స్నానం చెయ్యాలీ..
కానీ .....................
ఏదో ఒక రోజు నాలోని భావాలు  మౌనాన్ని గెలిచి 
నా అంతరంగ ఘోషని 
నా హృదయ పతనాన్ని నీకు సవివరంగా వివరిస్తాయి ,
నన్ను నీకు పూర్తిగా పరిచయం చేస్తాయి ..........
రాజేష్ ౧౧౨..........