7, సెప్టెంబర్ 2011, బుధవారం

తరంగిణి....

ఏదో పెదాల వీణను,
చిరునవ్వుల హస్తాలు మీటిన శబ్ధమస్తే,
చూసాను అటువైపు,
తనే పున్నమి వెన్నెలల,

చిరునవ్వుల్ని మార్గామన్తటా పరుచుకుంటూ మందగామినిల సాగుతుంది......
క్షణాల పువ్వుల్ని,
తన స్పర్శతో పూయిన్చుకుంటూ,
కాల కవితను వాటితో అలంకరించుకుంటూ,
ఎన్నో చూపుల అలలు చేరే తీరమై,
రూపంపోసుకున్న ఓ అందమైన భావమై,
మెరుపు తీగల కదులుతుంది......


భూమిపై  ఉరుములు నడుస్తున్నట్టు,
కాలి గజ్జెల ధ్వని వినిపిస్తే,
చూసాను అటువైపు,
తనే ప్రకృతంతా మాటల ఢమరూకాల్ని మోగించుకుంటూ,
తరంగిణిల తరలిపోతున్తుది...
గుండె నిండ,
 పలకరింపుల అరుణ తారల్ని మెరిపించి,
తను చూస్తె ఎన్నో మనసులు ,
సుడిగుండంలో పడి అల్లాడుతాయి...
తను పలకరిస్తే ఎన్నో ఆశలు,
ఆనందంతో తల్లడిల్లుతాయి...
తను ఎందరి మదిలో దేవత,
నన్ను తప్ప ఎవ్వరిని కరుణించని మాలెత...

5, సెప్టెంబర్ 2011, సోమవారం

నా పల్లె.....


అడుగుపెడుతుంటే,
అనురాగ హిమమును కురిపించి స్వాగతించేది,
పలకరింపుల పరిమళాలు పూసి,
మనసంతా ఆనందాన్ని నింపేది,
బంధాల పూలమాలలు వేసి,
మాటల అక్షింతలు జల్లి,
బాగోగుల హారతులిచ్చేది నా పల్లె.....
కోయిలల రాగాలతో,
పక్షుల కిల కిల ధ్వనులతో,
పంటచేనుల నాట్యాలతో,
తీరొక్క పూల అలంకరణతో,
విరాజిల్లేది నా పల్లె...
పండుగ నాటి ఆడపడుచుల,
పెళ్ళికూతురుల ముస్తాబయ్యేది నా పల్లె....
ప్రబంధాలలోని వర్ణనలు,
కావ్యాలలోని వివరణలు,
నా పల్లెని చూసే మలచబడ్డాయి....
ఎందఱో రాజులు నా పల్లె కోసం యుద్ధాలుచేసారు..
సంబంధాల సిరులకోసం,
ఆప్యాయతల హృదయాల కోసం....
పల్లెలో ప్రతి ఒక్కరి పెదాలపై,
చిరునవ్వు లాస్యమాడుతూ ఉండేది..
ప్రతి ఒక్కరి ఇంటిలో,
దేవతలు సేదతిరుతూ ఉండేవారు..
ఏ కుబేరుడు,
మా పల్లె ప్రజలంతా ధనవంతుడు,
ఆత్మీయతలొ..
ఏ ఇంద్రుడు,
మా పల్లె ప్రజలంతా అదృష్టవంతుడు,
స హృదయతలో..
నా పల్లె
విరచిస్తే ఒక కావ్యం..
పాడితే ఒక సాటిలేని గానం..

అలాంటి నా పల్లె ఇప్పుడు.....
వెళ్తే మౌనాల మల్లెలు చల్లుతుంది,
కన్నీల్లతొ కాళ్ళు కడుగుతుంది..
పగిలిన నాలుకలా,
నీటికై తపిస్తూ,
వలస పాదాలతో పరుగులు తీస్తుంటుంది..
మాడిన డొక్కలా,
ఆహారానికి అన్వేషిస్తూ,
ఆశల రెక్కలతో,
కష్టాల వీధుల్లో విహరిస్తుంటుంది.
నిరీక్షిస్తున్ననయనాల్లా
చెదిరిన స్వప్నాలతో,
నిషా వస్త్రాలతో,
అందని ఆనందాలకోసం,
గాయాల గుండెగా ప్రయానిస్తుంటుంది.
బీడుగా మారిన వర్తమానంతో,

జ్ఞాపకాలుగా మారిన గతాన్ని గుండెల్లో నింపుకొని,
అగమ్యమైన మార్గాలవెంబడి,
నిర్దిష్టం లేని భవితవ్యం కోసం,
కాల సంద్రంలో,
క్షణాల తెప్పపై ఈదుతూ ఉంటుంది.
సేద తీర్చే నీడ కోసం,
మెతుకునిచ్చే జాడ కోసం....
కరువు శత్రువు,
నా పల్లెను తాళాల సంకెళ్ళతో బంధించాడు..
బంధీ అయిన,
ఆనందాలు,
ఆప్యాయతలు,
విముక్తి చేసే మనిషి కోసం తల్లడిల్లుతున్నాయి..


ఇప్పుడు నా పల్లె,
మూగబోయిన తల్లి,
అనాధైన చెల్లి,
పరిమళాలు లేని జాజిమల్లి.......

29, ఆగస్టు 2011, సోమవారం

చివరి స్పర్శ(THE LAST TOUCH)........

పోతాను..
పోతాను..
నీ పెదాలాపైనుండి నడిచివచ్చిన నవ్వు,
నాకు దుఖంగ అందిన చోటునుండి..
నీ నోటినుండి జనించే మాటల పిడుగులై ,
నా మనసును కూల్చే చోటునుండి..
కన్నీళ్ళ కాసుల్ని కన్నుల్లో నింపుకొని..
మౌనపు మణుల్ని మూటగత్తుకొని..
పోతాను..
పోతాను..
ప్రేమే పాపమైన,
ధ్యాసే శాపమైన,
నేనంటే కోపమైన ,
కళ్ళముందు నుండి కదిలిపోతానూ..
మనసునుండి మాయమైపోతానూ..
పోతాను..
పోతాను..
నీతో నడిచిన ఒక్క దృశ్యమూ ..
నీతో గడిపిన ఒక్క సందర్భమూ..
నీతో వెల్లువిరిసిన ఒక్క సంతోషమూ..
నువ్వు తాకిన ఒక్క సన్నివేశమూ..
ఏవీ..
ఏవీ..
నా వెంట రావూ..
నీకోసం నేను ఖర్చుపెట్టిన ఆలోచనలూ,
నీకోసం నేను అనుభవించిన ఏకాంతాలూ,
గాయాలుగ మిగిలిన ఙ్ఞాపకాలూ,
తప్ప.
ఏవీ..
నా వెంట రావూ..
అయినా పోతాను..
భువి నుండి దివికి..
ఎదుటనుండి ఎదలోకి..
సాంగత్యం నుండి స్మృతిలోకి
సజీవం నుండి శూన్యంలోకి..
దారిలేని తీరంలోకి..
ఓ ప్రియా..!!!
నా చివరిచూపు నీ రూపంగ కరిగిపోవాలి..
నా చివరి శ్వాస నీలో చేరిపోవాలి..
నీ ఒడిలో ఒదిగిపోవాలి..
నీ చేతి స్పర్శలో చనిపోవాలి..
ఇదే నా చివరికోరిక..
అదే మన ఆఖరి కలయిక..
అదే మన ఆఖరి కలయిక..

కన్నీరు లేని కావ్యం....

నిశ్శబ్దపు ప్రాంగణంలో ఉన్న,
నావైపు తను నడుస్తూ వస్తుంటే,
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న  కాలి గజ్జెల సవ్వడి,
గతించిన నా గుండె సవ్వడిని,
ధ్వనిగా మార్చుకున్నాదో ఏమో అని అనిపిస్తుంది..
ఎడబాటు నుండి ఎదవైపుకు తను కదిలివస్తుంటే,
మాసిపోయిన నా మౌనాలన్నింటిని మాటలుగా మలిచి,
కర్ణబేరుల్ని మోగించడానికి వస్తున్నదో అన్నట్టుంది.
తను కళ్ళెత్తి చూస్తె పడే ఆ చూపుల వర్షం,
నా గుండెల్లో ప్రేమ జల్లులై పడి,
ఆనంద పువ్వుల్ని పూయిస్తాయి.
తను తాకిందంటే ఆ స్పర్శ హర్షమై,
ఆత్మీయ అనురాగాల్ని అణువణువు నిపుతుంది..
ఇక తను నాతో సాగిందంటే,
క్షణమో రసమై,
నిమిషమో అనుభవమై,
జీవితాన్ని ఆకాశంలోని మేఘంలా,
అలుపెరగని ప్రవాహంలా,
ఆటంకంలేని గమనంలా మార్చేస్తుంది..
నిరంతరం నవ్వై,
ప్రేమ పువ్వై,
పరిమళాల్ని పంచుతుంది..
కన్నీరు లేని కావ్యంగా,
నన్ను మారుస్తుంది..

చూపులు.....

ప్రపంచమంత బాదామయమైనప్పుడు,
గుండె నిండ దుఖాలు ఆవరించినప్పుడు,
నా చెలీ కళ్ళలోకి చూడాలనుకుంటాను,
ఎందుకంటే...
నా ప్రాణమైన తన చూపులు,
ఈ లోకాన్ని,
నా శోకాన్ని,
క్షాళనం చెస్తాయనీ..
ప్రశాంతతను ప్రసాదిస్తాయనీ..

ఏకాంతత నన్ను బంధించినప్పుడు,
ఆలోచనలు కాటు వేసునప్పుడు,
నా ప్రియురాలీ సాంగత్యంలోకి పోవాలనుకుంటాను,

ఎందుకంటే...
నా ఒంటరితనాన్ని,
రేగే గాయాల్ని,
దూరం చేస్తుందనీ..
మమకారం పంచుతుందనీ..  

ప్రేమఖైది.....

సఖీ..!!!
బడి చదివేటప్పడినుండి,
గుండెల్లో ప్రేమ గుడి కట్టాను నీకోసం..
విరచిస్తున్న ప్రేమ కావ్యానికి,
నాయకివై వెంట నడిచావూ..
అక్షరం అక్షరం ఒక అడుగై,
ఎన్నో స్థలాల్ని ముద్దాడాము..
నా పాదమై తోడున్నావూ..
నీ శ్వాసతో పువ్వుల్ని పూయించావూ,
నీ మాటతో కొండల్ని నవ్వించావూ,
నీ స్పర్శతో నదుల్ని లాలించావూ,
 నా చిన్నప్పటి ప్రేమవై పెరిగావూ..

కష్టాలొచ్చిన,
కలతలొచ్చిన,
నీ ఎదపై వాలనిదె నాకు వసంతం లేదు..
కన్నీరొచ్చిన,
పన్నిరొచ్చిన,
నిన్ను తాకనిదే నాకు ఆనందం లేదు..
నీకు గుచ్చుకొన్నది చిన్న మేకైన,
అది బాకై నా మనసులో దిగుతుంది..
నీ నుండి కారిన రక్త బిందువులు,
నా మనసువే కదా...
నీకు వచ్చింది చిన్న కన్నీటి బొట్టైన,
అది తుపానై నన్ను ముంచేస్తుంది,
ఆప్పుడు నేను కరిగిపోయిన మేఘాన్నవుతాను..

హాయిగా సాగిపోతున్న,
ప్రేమ కావ్యనికి ఓ విషాద మలుపు..
ప్రవహిస్తున్న గుండెలకు అలుపు..
అనుమాన హస్తం,
మరణ పంజరంలో బంధించిన మైనావయావూ..
యమపాశం వదిలిన ఏడుపువయ్యావూ..
కాలానికి ఎమిచెప్పలేక,
ఇక వెలుగేలేని సూరిన్నయ్యానూ..
ఎందుకంటే నేను నీ "ప్రేమఖైదీ"ని,
చావులో కూడ నీ తోడు లేనిదే,
నాకు జీవనం లేదు..
నువ్వు లేకపోతే నాకు మనుగడ రాదు..
ప్రేమ  
హృదయాలపై వాలే,
జంట సీతాకోకచిలుకలవుతామూ..
కొద్ది కాలపు యవ్వనికపై,
విషాద సినిమా అవుతామూ..

16, ఆగస్టు 2011, మంగళవారం

ఒక చూపు......

ఎప్పుడో ఒక్కప్పుడు
ప్రతి మనసు ఒక చూపుకు స్పందిస్తుంది.
ఆ చూపు ఇష్టంగ మారి,
ప్రేమగ చిగురించి,
జీవితమై నిలుస్తుంది,
ప్రతి సారి ఆ చూపునే మనసు తలుస్తుంది,
తనని తాను మరుస్తుంది..
తనని తాను మరుస్తుంది.