29, ఆగస్టు 2011, సోమవారం

చివరి స్పర్శ(THE LAST TOUCH)........

పోతాను..
పోతాను..
నీ పెదాలాపైనుండి నడిచివచ్చిన నవ్వు,
నాకు దుఖంగ అందిన చోటునుండి..
నీ నోటినుండి జనించే మాటల పిడుగులై ,
నా మనసును కూల్చే చోటునుండి..
కన్నీళ్ళ కాసుల్ని కన్నుల్లో నింపుకొని..
మౌనపు మణుల్ని మూటగత్తుకొని..
పోతాను..
పోతాను..
ప్రేమే పాపమైన,
ధ్యాసే శాపమైన,
నేనంటే కోపమైన ,
కళ్ళముందు నుండి కదిలిపోతానూ..
మనసునుండి మాయమైపోతానూ..
పోతాను..
పోతాను..
నీతో నడిచిన ఒక్క దృశ్యమూ ..
నీతో గడిపిన ఒక్క సందర్భమూ..
నీతో వెల్లువిరిసిన ఒక్క సంతోషమూ..
నువ్వు తాకిన ఒక్క సన్నివేశమూ..
ఏవీ..
ఏవీ..
నా వెంట రావూ..
నీకోసం నేను ఖర్చుపెట్టిన ఆలోచనలూ,
నీకోసం నేను అనుభవించిన ఏకాంతాలూ,
గాయాలుగ మిగిలిన ఙ్ఞాపకాలూ,
తప్ప.
ఏవీ..
నా వెంట రావూ..
అయినా పోతాను..
భువి నుండి దివికి..
ఎదుటనుండి ఎదలోకి..
సాంగత్యం నుండి స్మృతిలోకి
సజీవం నుండి శూన్యంలోకి..
దారిలేని తీరంలోకి..
ఓ ప్రియా..!!!
నా చివరిచూపు నీ రూపంగ కరిగిపోవాలి..
నా చివరి శ్వాస నీలో చేరిపోవాలి..
నీ ఒడిలో ఒదిగిపోవాలి..
నీ చేతి స్పర్శలో చనిపోవాలి..
ఇదే నా చివరికోరిక..
అదే మన ఆఖరి కలయిక..
అదే మన ఆఖరి కలయిక..

కన్నీరు లేని కావ్యం....

నిశ్శబ్దపు ప్రాంగణంలో ఉన్న,
నావైపు తను నడుస్తూ వస్తుంటే,
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న  కాలి గజ్జెల సవ్వడి,
గతించిన నా గుండె సవ్వడిని,
ధ్వనిగా మార్చుకున్నాదో ఏమో అని అనిపిస్తుంది..
ఎడబాటు నుండి ఎదవైపుకు తను కదిలివస్తుంటే,
మాసిపోయిన నా మౌనాలన్నింటిని మాటలుగా మలిచి,
కర్ణబేరుల్ని మోగించడానికి వస్తున్నదో అన్నట్టుంది.
తను కళ్ళెత్తి చూస్తె పడే ఆ చూపుల వర్షం,
నా గుండెల్లో ప్రేమ జల్లులై పడి,
ఆనంద పువ్వుల్ని పూయిస్తాయి.
తను తాకిందంటే ఆ స్పర్శ హర్షమై,
ఆత్మీయ అనురాగాల్ని అణువణువు నిపుతుంది..
ఇక తను నాతో సాగిందంటే,
క్షణమో రసమై,
నిమిషమో అనుభవమై,
జీవితాన్ని ఆకాశంలోని మేఘంలా,
అలుపెరగని ప్రవాహంలా,
ఆటంకంలేని గమనంలా మార్చేస్తుంది..
నిరంతరం నవ్వై,
ప్రేమ పువ్వై,
పరిమళాల్ని పంచుతుంది..
కన్నీరు లేని కావ్యంగా,
నన్ను మారుస్తుంది..

చూపులు.....

ప్రపంచమంత బాదామయమైనప్పుడు,
గుండె నిండ దుఖాలు ఆవరించినప్పుడు,
నా చెలీ కళ్ళలోకి చూడాలనుకుంటాను,
ఎందుకంటే...
నా ప్రాణమైన తన చూపులు,
ఈ లోకాన్ని,
నా శోకాన్ని,
క్షాళనం చెస్తాయనీ..
ప్రశాంతతను ప్రసాదిస్తాయనీ..

ఏకాంతత నన్ను బంధించినప్పుడు,
ఆలోచనలు కాటు వేసునప్పుడు,
నా ప్రియురాలీ సాంగత్యంలోకి పోవాలనుకుంటాను,

ఎందుకంటే...
నా ఒంటరితనాన్ని,
రేగే గాయాల్ని,
దూరం చేస్తుందనీ..
మమకారం పంచుతుందనీ..  

ప్రేమఖైది.....

సఖీ..!!!
బడి చదివేటప్పడినుండి,
గుండెల్లో ప్రేమ గుడి కట్టాను నీకోసం..
విరచిస్తున్న ప్రేమ కావ్యానికి,
నాయకివై వెంట నడిచావూ..
అక్షరం అక్షరం ఒక అడుగై,
ఎన్నో స్థలాల్ని ముద్దాడాము..
నా పాదమై తోడున్నావూ..
నీ శ్వాసతో పువ్వుల్ని పూయించావూ,
నీ మాటతో కొండల్ని నవ్వించావూ,
నీ స్పర్శతో నదుల్ని లాలించావూ,
 నా చిన్నప్పటి ప్రేమవై పెరిగావూ..

కష్టాలొచ్చిన,
కలతలొచ్చిన,
నీ ఎదపై వాలనిదె నాకు వసంతం లేదు..
కన్నీరొచ్చిన,
పన్నిరొచ్చిన,
నిన్ను తాకనిదే నాకు ఆనందం లేదు..
నీకు గుచ్చుకొన్నది చిన్న మేకైన,
అది బాకై నా మనసులో దిగుతుంది..
నీ నుండి కారిన రక్త బిందువులు,
నా మనసువే కదా...
నీకు వచ్చింది చిన్న కన్నీటి బొట్టైన,
అది తుపానై నన్ను ముంచేస్తుంది,
ఆప్పుడు నేను కరిగిపోయిన మేఘాన్నవుతాను..

హాయిగా సాగిపోతున్న,
ప్రేమ కావ్యనికి ఓ విషాద మలుపు..
ప్రవహిస్తున్న గుండెలకు అలుపు..
అనుమాన హస్తం,
మరణ పంజరంలో బంధించిన మైనావయావూ..
యమపాశం వదిలిన ఏడుపువయ్యావూ..
కాలానికి ఎమిచెప్పలేక,
ఇక వెలుగేలేని సూరిన్నయ్యానూ..
ఎందుకంటే నేను నీ "ప్రేమఖైదీ"ని,
చావులో కూడ నీ తోడు లేనిదే,
నాకు జీవనం లేదు..
నువ్వు లేకపోతే నాకు మనుగడ రాదు..
ప్రేమ  
హృదయాలపై వాలే,
జంట సీతాకోకచిలుకలవుతామూ..
కొద్ది కాలపు యవ్వనికపై,
విషాద సినిమా అవుతామూ..

16, ఆగస్టు 2011, మంగళవారం

ఒక చూపు......

ఎప్పుడో ఒక్కప్పుడు
ప్రతి మనసు ఒక చూపుకు స్పందిస్తుంది.
ఆ చూపు ఇష్టంగ మారి,
ప్రేమగ చిగురించి,
జీవితమై నిలుస్తుంది,
ప్రతి సారి ఆ చూపునే మనసు తలుస్తుంది,
తనని తాను మరుస్తుంది..
తనని తాను మరుస్తుంది.

"నేనంటె చాల ఇష్టం"...

కడవరకు తోడుండి,
అమ్మలా ప్రేమను పంచుతానన్న మమకారం,
మధ్యలోనే మౌనమయ్యింది..
పలుకుగా మారిన నాలోని భావవేమో,
పిలిచినచలించని మనసులేక,
శూన్యంలోనె సాగిపోతుంది..
"నేనంటె చాల ఇష్టం" అన్న అక్షరాలు మళ్ళి కలవక,
ఆత్మబలిదానంచేసుకొన్న ఆశ,
నిప్పంటించే తోడుకై ఎదురుచూస్తుంది..
నీ ప్రేమతో
జతగమారిన నా హృదయస్పందన,
కారణములేకుండ నువ్వు వీడిపోతె,
ఒంటరై,
నిర్జీవమై..
నిశ్శబ్దమై..
దేహానికి
ఆత్మను అంటరానిదిగ మార్చేసింది..
నన్ను నిలువున కూల్చేసింది..
ఆపై నేను..
వాయువై నీలో చేరిపోతా..
స్పందనై నీ తోడుంట.....
స్పందనై నీ తోడుంట.....

నేను ఇష్టాన్నో..!! లేక ద్వేషాన్నో..!!


కష్టాల మబ్బులు ఆవరించి,
కన్నీళ్ళ ముసురు పట్టింది నా జీవితానికి,
ఆలోచన ఉరుములతోటి,
ఙ్ఞాపకాల పిడుగులు పడుతున్నాయి నా మన్సు మీద..
నీ ఎడబాటుతో..

ఈ క్షణం నిన్ను ప్రేమించవద్దనుకుంటూనే,
ప్రతి క్షణం నీ ద్యాసతో అనుభవమై వెలుగుతుంది..
ఈ నిమిషం నిన్ను గుర్తుకుతెచ్చుకోవద్దనుకుంటూనే,
ప్రతి నిమిషం నీ రూపమై చిరునవ్వుల్ని చిందిస్తుంది..
కాలం వేటకు,
బలైన సంతోషాన్నయ్యాను..
క్షణాల తూటాలకు,
ఆరిపోబోతున్న ఊపిరినవుతానేమో..??
నేను ప్రేమికున్నో..!!
లేక దుఖితున్నో..!!   నీ తలపులో...
నేను ఇష్టాన్నో..!!
లేక ద్వేషాన్నో..!!   నీ మనసులో...

15, ఆగస్టు 2011, సోమవారం

నా దేహమొక మ్యూజియం.........

అమ్మ కౌగిలి కరువై,
అమ్మ ప్రేమ దూరమై,
చాల సంవత్సరాలయ్యింది..
అమ్మ పదం విన్నప్పుడల్ల,
అంతరంగం అల్లకల్లోలమై,
భావాలు కన్నీల్లతో తడిసి,
గుండెపై కురవగ,
మనస్సు భారమైపోతుంది..

వెలుగు నిండిన దారంత,
చీకటిమయమై,
లోకమంత చీకటితో కలిసి,
నా కన్నులపై వాలగా,
నిద్రించిన నా నయనాలు,
కలలో అంతంలేని మార్గాల వెంబడి పరుగులు తీస్తుంటాయి..
శ్మశానాల  వాకిల్లలోచేరి దుఖిస్తుంటాయి..
తడి కన్నులతో చూసిన దృశ్యంలా,
ఎప్పు డో చూసిన అమ్మ రూపాన్ని,
పలకరించని మౌనభాషగ,
జాగ్రత్తగ నిలిపాను నా హృదయంలో,
అమ్మ నా వెంటే సాగుతుంది ప్రతి పాదంలో,
దారిగా మారి..
అమ్మ నాతోనే ఉంటుంది ప్రతి స్పందనలో,
శ్వాసగచేరి..
కాలంతో సాగేది మారుతుంది,
కానీ నా గుండెల్లో ఉన్న అమ్మ రూపం మారలేదు,
ఆనాటికి..
ఈనాటికీ.. చిరునవ్వులా....
అమ్మ ఙ్ఞాపకాల్ని అణువణువు భద్రపరిచిన,
విలువైన సంతోష క్షణాల్ని నిలిపిన,
నా దేహమొక మ్యూజియం,
నా శరిరం అమ్మకోసమే నిర్మించబడ్డ దేవాలయం..
అప్పుడు..
ఇప్పుడు..
ఎప్పుడు..
నేనొక భక్తున్నే..
నిరంతర దుఖితున్నే...
నిరంతర దుఖితున్నే...

11, ఆగస్టు 2011, గురువారం

ఓ కలగ మిగిలిపోవాలి...

ప్రియా..!!!
నా జీవితమైన బాధ,
నీకు ఒక్క క్షణమే ఉండాలి...

నా చిరకాల దురదృష్టం,
నీకు ఒక్కసారితో తీరిపోవాలి...

నేను ఎల్లప్పుడు అనుభవిస్తున్న కష్టం,
నీకు ఒక్క అడుగుతోనే అంతం కావాలి...

నా నీడైఉండే అవమానం,
ఒక్క సూర్యోదయంతో చేజారిపోవాలి...

నేను సదాపొందె దుఖం,
నీకు రెప్పపాటుతో ముగిసిపోవాలి...

నా సకలమై వెంట సాగె ప్రెమ,
నీకు ఓ కలగ మిగిలిపోవాలి...

కాలం కక్ష......

ఆశలను మనసంత నింపుకొని,
సంతోషాలను భద్రపరుచుకొని,
అదృష్టాన్ని  పరిక్షించదలుచుకొని,
కొత్త సూర్యోదయపు కిరణాల్ని చూడాలనుకొని,
జీవితాన్ని నూతనంగ అవిష్కరించదలుచుకొని,
దుఖపు గతాన్ని మరవాలని,
ఆనందతీరాల్ని చేరాలనుకున్న..
కానీ..
కాలం కక్షగట్టి,
దురదృష్టం  పగబట్టి,
శ్వేతవర్ణంగల నా మనసుని,
సౌధంల పొదిగే నా ఆశల్ని,
లేతచిగురులాంటి నా జీవితాన్ని,
మసిపూసి,
కూలగొట్టి,
నరికివేసి,
నా జీవిత సామ్రాజ్యానికి అధిపతులై,
నిరంతర నిస్పృహ లతో,
బాధలతో,
శత్రుపక్ష కక్షతో నన్నెప్పుడు అంతమొందించాలా అని చూస్తున్నాయి..
ఆరాటపడుతున్నాయి..


మృత్యువివి....

ప్రియ బాంధవీ..!!!!
ఒక్కప్పుడు నువ్వు,
నన్ను చేరని చిరునామావి..

ఆ తర్వాత,
నన్ను కలిసిన చూపువి..

ఆ తర్వాత,
నా అంతరంగంలో ప్రేమదీపాన్ని వెలిగించిన దేవతవి..
నా అడుగుల దారిని మార్చిన గమ్యానివి..

కానీ ఇప్పుడు....
నన్ను చూస్తూ కూడ,
పలకరించని శబ్దానివి..
నా ముందే తిరుగుతు కూడ,
నన్ను చేరని చిరునవ్వువి..
నాతోనే ఉంటు కూడ,
నన్ను స్పర్శించని ఆనందానివి..
క్షణాల శిలలకు,
నా ఆలోచనల్ని వేలాడతీస్తున్న కాలానివి..

ఇక రేపు...
అంతంచెందించనిదే,
పంతం వదలని ద్వేషానివి..
జీవన పడవను,
ముంచనున్న సునామివి..
నా ప్రియ మృత్యువివి..
కొరి తెచ్చుకున్న శత్రువివి...

పండుటాకును నేను....


క్షణాల కెరటాల కింద,
చిక్కుపోయిన నీటి బిందువుని నేను....
దుఖపు మబ్బు నిండ,
వ్యాపించిన కన్నీటి చుక్కని నేను....
కష్టాల పెదాల మీద,
నర్తించిన ఏడుపు శబ్దాన్ని నేను....
కలతల పందిరిపైన,
ఎండిపోయిన ఆశ లతను నేను....
ప్రేమ ఆకాశం నుంచి,
రాలిపోయిన ద్వేష నక్షత్రాన్ని నేను....
ప్రపంచ వృక్షము నుండి,
జారిపోయిన పండుటాకును నేను....

నా బ్రతుకు...........
నిరాశల సౌధం,
నిట్టూర్పుల ఆలయం,
కన్నీళ్ళ కోవెల,
ఆరిపొయిన జ్వాల.....

నా కవిత్వమొక........

గుక్కపట్టి ఏడ్చే పసి పిల్లలకు,
నా కవిత్వమొక తూగుటుయ్యాల..
విరహవేదనలో అలాడుతున్న మనసుకి,
నా కవిత్వమొక శాంతి కోవెల..
పనిచేసి అలసి సొలసిన శ్రామికులకి,
నా కవిత్వమొక ఆహ్లాదపు కోయిల..
గాఢాంధకారము అలుముకున్న బ్రతుకులకు,
నా కవిత్వమొక ద్వీపపు జ్వాల..
శ్రమిస్తున్న కర్షకుల పదాలకు,
నా కవిత్వమొక రాగాల మాల..
క్షరమైపోతున్న క్షణాల్ని క్షేమంగ దాచే,
స్నేహపు శాల..
సంతోషపు బిందువుల్నిహృదయాల  తీరానికిచేర్చే,
పదాల అల...

సకల కళ మేల,
అనుభవాల కోవెల,
అందమైన బాల,
గుండెనుండి చిమ్ముకొచ్చిన అక్షర లావ,
చేస్తుంది ఙ్ఞానికి పాదసేవ.....
చేస్తుంది ఙ్ఞానికి పాదసేవ.....


9, ఆగస్టు 2011, మంగళవారం

వశిష్టులు......

చేసిన ప్రతి కార్యం విజయము పొందాలని  "జై" అంటు,
జీవితయాత్రలో వ్యవసాయముచేసి ఘనత సాదించాలని "కిషన్"గా కూర్చి,
"జై కిషన్" గా మలిచారు మీ నామధేయము...
జారిపోతున్న ఎన్నో  పేదరికపు బ్రతుకులకి చేయూతనందించిన,
మానవత్వం మూర్తీభవించిన మాన్యులు మీరు...

కూరుకుపోతున్న ధర్మపురి చరిత్రని,
నిరంతర పరిశోధనతో వెలికితీసి,
దేదీప్యమానంగ వెలిగించి,
ప్రపంచానికే పరిచయంచేసిన ప్రముఖులు మీరు...

అంతరించిపోతున్న ఇనుము ఉక్కు పరిశ్రమని,
మీ సాధనతో నిలబెట్టి,
చేతబట్టి,
ఉత్తర తెలంగాణకి వెలుగునిచ్చిన ప్రధాతలు మీరు...

చరిత్ర రాజ్యానికి,
మీ అమూల్యమైన  శోధనలు అందించి,
చరిత్రనే సుసంపన్నంచేసి,
సువిశాలంగ విస్తరింపజేసి,
ఎంతో మంది వాక్కుల్లో ఒదిగిన వశిష్టులు మీరు.....

సాయంకళాశాలలో అధ్యాపకులుగ పనిచేస్తు,
అసహాయంతో అర్వాచీన ఆశ్రయాలను పరిశీలించి,
మరోచరిత్ర సృష్టించిన  గొప్ప చరిత్రకారులు మీరు......

అనవరత అధ్యాయనతత్పరులు,
సతతము శ్రమించె  కృషివరులు,
మా అంతరంగాల్ని చక్కబెట్టిన మనోవైద్యులు,
సంతోషాన్ని పండించే సేద్యులు,
ప్రతివారి క్షేమాన్ని కాంక్షించే సజ్జనులు,
మహానుభావులు,
పూజ్యనీయులు,,
మా గురువర్యులు,
ఆదర్శ ఆచార్యులు,
డా''  'జై కిషన్" గారు......

ఆశలకోసం అన్వేషణ ..........

తండ్రి లేక,
తల్లి లేక అనాథవైనవాడా..
తిండి లేక,
నిద్ర లేక బలహీనమైనవాడా..
ఏమిటి ఈ బ్రతుకు,
దొరకడంలేద చిన్ని అన్నం మెతుకు,
ఆకలితో ఆర్తగీతం చేస్తు,
చెత్తకుప్పలతో స్నేహం చేస్తు,
నిరంతరం పరిశోధకుడివై,
నీ కడుపు నింపుకొనుటకై కష్టపడుతున్నావా.. ?
ఏమీ ఈ దౌర్భాగ్యమని నిందించుకుంటున్నావా.?
కస్టాల్ని సంచుల్లో నింపుకొని,
ఆకాశాన్ని వస్త్రంగ కప్పుకొని,
ఆశలకోసం అన్వేషిస్తున్నావా.?
ఎవరి మీదో తెలియని కోపంతో,
అధికంగ వేసే తాపంతో,
కాలంతో పోరాడుతున్నావా..?
జీవితాన్ని ఎండిన వాగుగ సాగిస్తునావా.?

ఓ స్నేహితుడా....!!!!
అనాథవైనా అన్ని ఉన్నాయనుకునే వాడివి నువ్వు,
అన్నీ ఉన్నా అనాథను నేను..
నీకన్న నేనేనయ్యా నిజమైన అనాథని,
ఓ గాథని...
నిరంతర వ్యథని..

అస్తమయం...........

ఊర్వశి....!!!!!!
నీ కలయికతో,
కాలాన్ని కలలతో కవ్వించావు..
నీ స్పర్శతో,
మనసును భావాలతో అలంకరించావు..
మన మధ్య దూరానికి చూపుల వంతెన కట్టి,
నా హృదయ  తలుపులు తట్టి,
మానస కోవెల్లో కోమలివై పాదం పెట్టి,
మునపటి లోకమంత నువ్వుగ మారావు..
నా కన్నుల రాళ్ళపై అందమైన  దృశ్యాల్ని చెక్కావు..
నీ మాటల్తో బ్రతుకంత మధురంగ మలిచావు..
రూపమొక్కటే నేను,
నా అణువణువు నువ్వుగా మారిన తర్వాత,
నువ్వు నన్ను వీడిపోయావు..
నాకు దూరమయ్యావు..
నీ ప్రేమను ఆశించిన మనసుకు మళ్ళి ఆశనే మిగిల్చావు..
జటకోసం వెతికిన పాదానికి దారినే చూపావు..
తరంగంల నిను చేరిన ప్రతిసారి,
విషాదాన్నే మిగిల్చావు..
వెలుగై నిన్ను కలిసిన ప్రతిసారి,
చీకాటిగానే మార్చావు..

రేపు...........
నీకు...
ఈ లోకానికి......
సూర్యోదయం......
నాకు....
నా మనసుకు....
అస్తమయం...........
అస్తమయం...........

8, ఆగస్టు 2011, సోమవారం

ద్వేషం....

జారిన కన్నీటి బొట్టుకే తెలుసు,
ఎడబాటు ఎంత విషాదమైనదో అని,.

మూగబోయిన  కోయిలకే తెలుసు,
మౌనం ఎంత బరువైనదో అని,....

చీకటైన రాత్రికే తెలుసు,
ఒంటరితనం ఎంత కటినమైనదో అని...

పగిలిన నా మనస్సుకే తెలుసు,
ద్వేషం ఎంత తీవ్రమైనదో అని...
ద్వేషం ఎంత తీవ్రమైనదో అని...

6, ఆగస్టు 2011, శనివారం

ఏ మనసు పెట్టిన శాపమో...???

నువ్వు నవ్వే ప్రతి నవ్వు,
నా గుండేల్లో గునపాలై గుచ్చుతున్నాయి.....
నువ్వు పంచుకుంటున్న ప్రతి ఆనందం,
నన్ను దుఖసంద్రంలోకి తీసుకెల్తున్నాయి.....
నువ్వు వేసే ప్రతి అడుగు,
నన్ను స్మశానంవైపు నడిపిస్తున్నాయి......
నువ్వు పలికే ప్రతి పలుకు,
నాకు మౌనపు విషాన్ని తాగిస్తున్నాయి......
నువ్వు చేసే ప్రతి క్రియ,
నన్ను నిర్జీవంగ మార్చేస్తున్నాయి....
ఓ కాలమా..!!!!
నాకు ఎందుకింత కష్టము,
నాకు ఎందుకింత క్లిష్టము,
నాకు ఎందుకింత మనస్తాపన,
నాకు ఎందుకింత దుఖస్థాపన,.......
ఏ జన్మలో చేసిన పాపమో,..???
ఏ మనసు పెట్టిన శాపమో...???

స్పందన రాగం..

ఇష్టసఖీ...!!!!
నీ మనసు కలతచెందిందంటే,
నా హృదయస్పందనను రాగంగ మలిచి సేదతీర్చుతా....
నీ నయనం అలిసిపోయిందంటే,
నా ఆలోచనల్ని ఊయలగ చేసి జోకొడుతా....
నీ దేహం వణికిపోతుందంటే,
నా ఊపిరిని వేడిగ తయారుచేసి తగ్గిస్తా....
నీకు ఆకలయ్యిందంటే,
నా ఙ్ఞాపకాల్ని ఆహారంగ వండి అందిస్తా......
నీ ప్రయాణం ఒంటరయ్యిందంటే,
నా పాదాల్ని దారిగ పరిచి నడిపిస్తా....
నీకు కాలం భారమయ్యిందంటే,
నా ప్రేమను రమ్యాలోకంగ నిర్మించి బహుకరిస్తా......
పలుకుల బొమ్మలతో ఆడిపిస్తా......

అంతట నిండి వున్నావు....

ఓ దేవి..!!!
నా ఎదురుగ నువ్వు లేకపోయినా,
గుండేల్లో కొలువైనావు..
కన్నులకు కనిపించకపోయినా,
కనుచూపువైనవు..
రాగం నువ్వుకాకపోయినా,
గొంతువై నిలిచున్నావు..
తోడుగ లేకపోయినా,
అణువణువు నిండిపోయావు..
నీడవై లేకపోయినా,
రూపమై ప్రతిబింబించావు..
ఆనందమై ఆశ్రయించకపోయినా,
దుఖమై క్షణక్షణం సాగుతున్నావు..
అమ్రుతాన్ని అందించకపోయినా,
దుఖపువిషాన్ని తాగిస్తున్నావు..
మనసును ఆర్థం చేసుకోపోయినా,
ప్రియురాలివై ప్రేమనిచ్చావు..
నన్ను వదిలిపోయనా,
ఙ్ఞాపకమై అంతట నిండి వున్నావు..
              అంతట నిండి వున్నావు.. 

,ఓ జీవితం.

జననం,
మనకు ప్రపంచాన్ని పరిచయంచేస్తుంది..
ప్రతిభ,
జీవితానికి ఆర్థాన్నిస్తుంది..
స్నేహం,
కష్ట,సుఖాల్లో  చేయూతనిస్తుంది..
ప్రేమా,
ఒక మనసుతో మరో మనసును జోడిస్తుంది..
జీవితాంతం మిగిలే ఙ్ఞాపకాలనిస్తుంది..
మరణం,
బంధాలన్నిటినుండి దూరంచేస్తుంది..
మరోచోటికి  ఒంటరిగ సాగనంపుతుంది..
మరో జన్మకి ఆరంభాన్ని పలుకుతుంది..
మనల్ని ఓ స్మ్రుతిగ మారుస్తుంది..
             ఓ స్మ్రుతిగ మారుస్తుంది..

ప్రేమ సామ్రాజ్యం.....

నా ప్రాణమా..!!!!
నా లో నీకు గుడిని కాదు,
ఏకంగా ప్రేమ సామ్రాజ్యాన్నే నిర్మించాను..
నా రాజ్యానికి నిన్ను మహరాణిని చేసాను..
ఆ రాజ్యంలో.......
నువ్వు పలుకుతున్న ప్రతి మాట,
నా గుండె చప్పుడై వినిపిస్తుంది..
నువ్వు చూసే ప్రతి చూపు ,
నాకు ద్రుశ్యమై కనిపిస్తుంది..
నువ్వు పొందే ఆనందం,
నా ఊపిరై సాగుతుంది..
నువ్వు చేసె ప్రయాణము,
నా రక్త ప్రవాహమై సాగుతుంది..
నువ్వు జీవిస్తున్న చోటు,
నా శరీరాన్ని రక్షిస్తుంది..


కానీ............
నువ్వు నన్ను ప్రేమించక,
                     కరుణించక,
ప్రేమ సామ్రాజ్యంలో తిరుగుతుంటే.....
సంతోషంతో విహరిస్తుంటే.....
నీ పాద తాకిడికి,
మనస్సు బాధపడుతుంది..
ఆ బాధ నిరంతరం నిన్నే గుర్తుకు తెస్తుంది..
                                 నన్నే మరిపిస్తుంది..

ఒక్క మాటతో..........

"ప్రేమించాను" అనే ఒక్క మాటతో,
నా శవానికి ప్రాణం వస్తుందంతే చెప్పలేవా..???
"మనసిచ్చాను" అనే ఒక్క మాటతో,
నా మనసు చిగురిస్తుందంటే చెప్పలేవా..???
"కరుణించాను" అనే ఒక్క మాటతో,
నా ప్రేమ సామ్రాజ్యం నిలుస్తుందంటే చెప్పలేవా..???
'ఆరాధిస్తానూ అనే ఒక్క మాటతో,
నేను సంతోషంగ ఉంటానంటే చెప్పలేవా..???
"నీ జీవితమై ఉంటానూ అనే ఒక్క మాటతో,
నా జీవితం సుఖంగ ఉంటుందంటే చెప్పలేవా..???
"నీ తోడై  ఉంట"   అనే ఒక్క మాటతో,
ఈ లోకాన్ని జయిస్తనంటే చెప్పలేవా..???
నా సర్వస్వం నువ్వు"  అనే ఒక్క మాటతో,
మోడైన నా జిందగి చిగురిస్తుందంటే చెప్పలేవా..???
"నేను నువ్వుగ నిలుస్తాను" అనే ఒక్క మాటతో,
నా కలలు నిజాలవుతాయంటే   చెప్పలేవా..???
నా కలలు నిజాలవుతాయంటే   చెప్పలేవా..???

ఏమిటి.???

కన్నులుండి ఏమిటీ.?
కనుచూపైన నువ్వే లేకపోతే..
కాళ్ళుండి ఏమిటి.?
చలనమైన నువ్వే లేకపోతే..
రాగముండి ఏమిటి.?
గొంతైన నువ్వే లేకపోతే..
పలుకుండి ఏమిటి.?
నాలుకైన నువ్వే లేకపోతే..
వాయువుండి ఏమిటి.?
ప్రాణమైన నువ్వే లేకపోతే..
హృదయముండి  ఏమిటి.?
స్పందనైన నువ్వే లేకపోతే..
కళుండి ఏమిటి.?
దానిని తీర్చే నువ్వే లేకపోతే..
ప్రేముండి ఏమిటి.?
కరునించే నువ్వే లేకపోతే..
మనసుండి ఏమిటి.?
బ్రతికించే నువ్వే లేకపోతే..
అనురాగముండి ఏమిటి.?
ఆదరించే  నువ్వే లేకపోతే..
ఆదరించే  నువ్వే లేకపోతే..

బ్రతకాలన్న ఆశలేదు...

కలలున్నాయి,
కానీ తీరే వీలులేదు..
ఆశలున్నాయి,
కానీ సరిపడ  ధనము లేదు..
జీవితముంది,
కానీ బ్రతకాలన్న ఆశలేదు..
ప్రేముంది,
కానీ అర్థంచేసుకునే మనసులేదు..
మనసుంది,
కానీ ఆదరించే తోడులేదు..
సంతోషముంది,
కానీ ఉండేందుకు సమయము లేదు..
అనురాగముంది,
కానీ పంచుకునే ప్రియురాలు లేదు..

ఎంత బంధించిన......

ప్రేమ దీపమా..!!!!
నా కన్నులను ఎంత బంధించిన,
నీ రూపాన్నే గుర్తుకు తెస్తున్నాయి..
ఆలోచనల్ని ఎంత తక్కువ చేసిన,
నీ గురించె ఆలోచిస్తున్నాయి...
నా ప్రయాణాన్ని ఎంత నిలిపివేసిన,
నీ వైపే నా అడుగులు సాగుతున్నాయి..
నీపై ప్రేమను ఎంత తగ్గించిన,
అంత ప్రేమ నీపై ఎక్కువవుతుంది..
నా మనసును ఎంత స్వాదీనం చేసిన,
నీ ప్రేమనే ఆశ్రయిస్తుంది..
నీ ఙ్ఞాపకాల్ని ఎంత ఖండించిన,
పదే పదే నిన్ను గుర్తుకు తెస్తున్నాయి..
నా పలుకుల్ని ఎంత తక్కువ చేసిన,
నీ పేరునే జపిస్తుంది..
నీ పేరునే జపిస్తుంది..

నా హృదయస్పందన నువ్వు...

ఓ అమ్రుతమా..!!!!
నేను శరీరమైతే,
నాలోని ప్రాణం నువ్వు..

నేను హృదయమైతే,
నా హృదయస్పందన నువ్వు..

నేను కన్నులైతే,
నా కన్నులచూపు నువ్వు..

నాది రాగమైతె,
నా ప్రేమ గానం నువ్వు..

నేను పుస్తకమైతే,
దానిలోని ప్రతి అక్షరం నువ్వు..

నాది మనసైతే,
ఆశ్రయించే తోడు నువ్వు..

నేను బాధైతే,
నాలోని సంతోషం నువ్వు..

నేను కవినైతే,
నాలోని భావన నువ్వు..

నేను మాటనైతే,
మాటలోని శబ్దం నువ్వు..

నేను జతనైతే,
నా జంట నువ్వు..

నేను మరణమైతే,
నా జీవనం నువ్వు..
నా జీవనం నువ్వు..

గుండెల్లో కొలువుంటావనుకుంటే....

ఓ సఖీ..!!!
నీకు పసుపుతాడై ఉండాలనుకుంటే,
నాకు ఉరితాడై బిగిసావు..

జతగ నీ తోడు ఉండాలనుకుంటే,
ఒంటరిగ జీవించేల చేసావు..

వరమై నాన్ను వరిస్తావనుకుంటే,
శాపమై దూరమయ్యావు..

నిజమై ఎదురస్తావనుకుంటే,
కలలాగే మిగిలిపోయావు..

అమ్రుతాన్ని పంచుతావనుకుంటే,
విషాన్ని చేతికందించావు..

ఆనందాన్ని ఇస్తావనుకుంటే,
తీరని బాధను మిగిల్చావు..

హ్రుదయరాణిగ ఉంటావనుకుంటే,
ప్రేమ సామ్రాజ్యాన్ని కూల్చేసావు..

గుండెల్లో కొలువుంటావనుకుంటే,
మనసునే నీతో తీసుకెల్లావు..
మనసునే నీతో తీసుకెల్లావు..

5, ఆగస్టు 2011, శుక్రవారం

స్నేహజలపాతం....


అనుభవించిన అన్ని క్షణాలు
అంతిమ దశవరకు నడచిరావు,
కాని వీడని క్షణాలన్నింటిని
నీ స్నేహంలోనె సంపాదించినవి.....

చేరువకాని ఎన్నో తీరాలుంటాయి,
తరగని అనేక దూరాలుంటాయి,
దూరాల్ని చెరిపేసి,
తీరాల్ని పాదాలకు తాకించె మైత్రి నీది.............

అందిరాని అమూల్య వరాలుంటాయి,
బరువైన హృదయ  భారాలుంటాయి,
భారాల్ని బంధించి,
వరాల్ని వారాలుగ వ్యవస్థాపన చేసె చెలిమి నీది.............

నీ స్నేహజలపాతంలో,
సదా తడిసిపోతా..
        మురిసిపోతా..

దారిగ పరిచి...

నీతో తిరిగిన ప్రతి ప్రదేశం,
నా కాళ్ళను బంధిస్తుంటే,
కదలలేని శిలనై నీకోసమే నిలిచున్నాను..

నీతో కలిసి చూసిన ప్రతి ప్రాంతం ,
నా కళ్ళను కాటేస్తుంటే,
కనుచూపులను దారిగ పరిచి నీకోసమే వేచి ఉన్నా...

నీతో గడిపిన ప్రతిక్షణం,
మనసుపై పూల మొక్కలై మొలుస్తుంటే,
నువ్వులేని క్షణాల్ని పువ్వులుగ పూయించి,
నీకోసమే ఎదురుచూస్తున్నా...

నువ్వు పలికిన ప్రతి పదం,
అనుభవమై నా జీవితాన్ని శాసిస్తుంటే,
మిగిలిన జీవితాన్ని నీకు అంకితమివ్వడానికి ,
నీ కోసమే బ్రతికున్నా...
""ఎండిన మనసుతో,
కాంతిలేని ఉషస్సుతో..""

నీకోసం....

పద్మినీ..
నీకోసం,
ఎన్నో చిరునవ్వుల పువ్వుల్ని,
నా పెదాల నుండి చిదిమేసాను...

నీకోసం
కలల తారల్ని,
నా నిద్రాకాశం నుండి దూరంచేసాను...

నీకోసం,
ఆశల పత్రాల్ని,
నా జీవిత పద్మం నుండి చిదిమేసాను...

నీకోసం,
సంతోషపు రత్నాల్ని,
నా హ్రుదయ గుప్తనిధి నుండి దానంచేసాను...

నీకోసం,
పలుకుల తేనెల్ని,
నా మౌనపు తుమ్మెదలకి అంకితంచేసాను...

నీకోసం,
మనసు మంచు ముక్కని,
విరహాగ్నితో కన్నీళ్ళుగ కరిగించాను...

నీకోసం,
చెక్కిళ్ళ అమ్మాయికి,
అశ్రువుల హారాన్ని బహుకరించాను...

సఖీ..!!!!
అన్నీ కోల్పోయిన నాకు,
ఆన్నీ దరికి తేను,
నన్ను, నా మనసును
కరుణించవేమే.. ??
కనికరించవేమే..?? 
కనికరించవేమే.. ??  

పరాయి లోకం



రేపైన నీ మనసు మారి,
నన్ను ప్రేమిస్తావనే ఆశతో,
ప్రతి రాత్రిని రగిలిపోతు గడిపేస్తున్నాను...
రేపైన మన ఎడబాటు సరస్సు ఎండిపోయి,
నా దరికి చేరుకుంటావనే కోరికతో,
ఒంటరితనంపై ఓడిపొతు సాగుతున్నాను...
మమకారం నీ మాటలుగ
నన్ను ముసురుకుంటుందనే నమ్మకంతో,
పలుకులను పరెసుకుంటూ కదులుతున్నాను...

నీ మనసు మారనప్పుడు..
ఎడబాటు ఎండనప్పుడూ..
మౌనం మాయం కానప్పుడూ..
నువ్వు అంగీకరించనప్పుడూ..
అనురాగాన్ని పంచనప్పుడూ..
నువ్వు ప్రేమించనప్పుడూ..
ఇక నేను...............
కన్నులను కదపడమెందుకూ..
శ్వాసని శ్వాగతించడమెందుకూ..
పరాయి లోకంలోకి పారిపోకా..
దుఖాలకి దూరంకాకా..

దూరం..సుదూరం...

చెలి..!!
నీ కనుచూపుల వాకిట్లో
 నా నయనాలు ప్రేమగ వేచి ఉంటాయి చూడు..
నీ ఆనంద  పందిరిపై,
నా ఆశల లతలు వాడిపోయి మిగిలుంటాయి 
చూడు..
నీ గుండె ఆలయంలో,
నా మనస్సు శిథిలమై ఉంటుంది 
చూడు,
నీ కలల సామ్రాజ్యం కింద,
నిద్రించని రాత్రులు సమాధియై ఉంటాయి 
చూడు,
నీ అదృష్ట  గ్రహంపై,
నా దురదృష్టపు స్త్రీకాలి గుర్తులుంటయి 
చూడు,
నీ అడుగుల కింద,
నశించిన నా కన్నీటి క్షణాలుంటాయి 
చూడు ..
నీ సంతోష లోకంలో,
నా ఆనంద బాలికలు ఏడుస్తు ఎదురస్తాయి చూడు..


సఖీ...!!!!
మనిద్దరి మనసులు ఒకటైన వేళ,
గెలుపు,ఓటమి
చావు,బ్రతుకు ఇరువురికి సమానం...
నీ మనస్సు అంగీకరించని నా మనసు వేరైనప్పుడు,
""గెలుపు నీదైతే,
ఓటమి నాదె కదా..
  ఆనందం నీదైతే,
అలజడి నాదే కదా..
ఈలోకం స్వర్గం నీకైతే,
నరకం నాకే కదా..
ఇకపై..........
జీవనం నీకైతే,
నా మనస్సుకు,
నాకు,
మరణమే కదా..
నీ రూపం,

నీ జ్ఞాపకం  దూరమే కదా..


4, ఆగస్టు 2011, గురువారం

ఒంటరిని చేసింది..



జలజాక్షీ..!!!
ఎందుకు నింపుకున్నావో,
నీ అణువణువున ప్రణయాన్ని,
దానికై నా మనసు మనసుపడి,
ఎడారిలోని జాబిల్లిల నన్ను ఒంటరిని చేసింది..
పువ్వుచుట్టు తుమ్మెదల నీ చుట్టె నా ఆలోచనల్ని తింపుతుంది..
నువ్వు నన్ను ప్రేమించకపోయేసరికి కన్నీరుగ కరుగుతుంది..

ఎంత అక్షరవర్షం కురిపించాలో?,
రేగె విరహాగ్నిని చల్లార్చేందుకు..
ఎంత సంతోషాన్ని ఆపుతెచ్చుకోవాలో?,
కలిగె దుఖాన్ని తొలగించేందుకు..
ఎంత ప్రేమను మట్టిలో కలపాలో?,
క్షణం నన్ను దాటేందుకు..
ఎంత కవితా  సారాయి తాగాలో?,
గుండె బరువును దించుకునేందుకు.....

కాలానుభూతిని పంచుకోవడానికి ప్రేమికునిగా మారాను..
నన్ను పలకరిం చె నీ చూపుల భాషకై అక్షరంగ మారాను..
ప్రతి అక్షరం గుండెకు అంకితంచేసుకుంటూ,
ఆగమాన్ని ఆహ్వానిస్తున్నా..
కాలాన్ని నీకోసమే నిలుపుతున్నా..
కాలాన్ని నీకోసమే నిలుపుతున్నా..

ఎలా బ్రతికేది..


నా రక్తంగ,
నీ తీపి గుర్తులు ప్రవహిస్తుటే,
నేను ఎలా నిన్ను మరిచేది..

నా కన్నుల్లో,
నీ రూపం పడు ఈదుతుంటే,
నిన్నేలా నేను చూడకుండ ఉండేది..

నా ఆలోచనలతో,
నువ్వు నిత్యం ఆడుకుటుంటే,
నేను ఎలా నీతో మాట్లాడకుండ ఉండేది..

నా గుండె గూటిలో,
ప్రేమగ నువ్వు నిద్రిస్తుంటే,
నిన్నేలా ప్రేమించకపోయెది..

ఈ శూన్యమంత నిండి,
నన్ను కవ్విస్తుంటే,
నిన్నేలా నేను తాకకుండ ఉండేది..

నా ఊపిరై,
నువ్వు నా హృదయ  వీధుల్లో తిరుగుతుంటే,
నిన్నేలా నేను ఆరాధించకుండ ఉండేది..

నా రూపమై,
నన్ను నడిపిస్తుటే,
నీకేలా నేను దూరమయ్యేది..
నిన్ను తప్పించుకొని ఎలా తిరిగేది...???
                              ఎలా బ్రతికేది...???


పిలుస్తూ.. తలుస్తూ.. కొలుస్తూ..



ప్రేమను ప్రేమించె సహృదయుడిగా ,
ప్రేమను ద్వేషించె ప్రేమికుడిగ,
రగిలిపోతు మిగిలిపోతా....
పగిలిన  హృదయంగా,
జారిన కన్నీరుగా,
మారిన దుఖానిగా,
అవతరించిన నిరాశగా,
మనసులేని శిలగా,
ఎడారిలో ఇసుక రేణువుగా,
నదిలో రాయిగా,
వాడిపోతున్న పువ్వుగా,
పారిపోతున్న నవ్వుగా,
మౌన భాషగా,
తీరని ఘోషగా,
మమతలేని మ్రానుగా,
నీవే ధ్యాసగా,
నిన్నే  పిలుస్తూ..
తలుస్తూ..
కొలుస్తూ..
కన్నుల నిండ కన్నీళ్ళను మోస్తూ..
చస్తూ బ్రతుకుతూ..

అధికారముంటుందా.?????


నిన్ను కలుసుకున్న కలయిక,
నాలో పుట్టిన ప్రేమ మొలక,
గతమే అయిన విగతం కానిది..
మాయే అయిన మానిపోనిది..
కలే అయిన కరిగి పోనిది..

జీవితపు అంచున నిలబడి,
ఓటమిని చూసి నా అంతరాత్మ నవ్వుతుంటే,
కన్నీటి తరంగాలే నాలొ మొదలవుతాయి..
ఎన్నటికి తగ్గని వేదనలే జనిస్తాయి..

కనురెప్ప కింద నువ్వు కొలువైఉండీ,
నీ సుకుమార హస్తాలతో నన్నెప్పుడు బాధిస్తుంటే,
రుధిర బాష్పాలు కాక కన్నీలొస్తాయా.?
కనులు నిన్ను కాక లోకాన్ని చూస్తాయా.?

నా అనుభూతి గ్రంథానికి కర్తవు నీవై..
నా కన్నీల్లను సిరగ మార్చి,
ఒక్కొక్క అక్షరం కష్టాలా నిలయంగ చెక్కితే,
ఆనదాలకు చోటుంటుందా.?
చిరునవ్వులకు స్థానముంటుందా.?
నా జీవితంపై నాకు అధికారముంటుందా.?????
                            అధికారముంటుందా.?????

అందుకే..




వెలుగు సూర్యున్ని అసహ్యించుకుంది,,
అందుకే..
ఈ లోకమంత చీకటిమయమయ్యింది...

కాలం ప్రకృతిని  చీదరించుకుంది,,
అందుకే..
ఈ శూన్యమంత ఎడారయ్యిది...

ప్రేమ నన్ను ద్వేషించింది,,
అందుకే..
నా దేహమంత కన్నీళ్ళ నిలయమయింది...

ఎందుకనీ....


ఓ మనసా..!!!
నన్ను,
నా హృదయాన్ని  నీ ప్రేమతో జతగా మారుస్తావని,
మానసంలో ప్రేమ లోకాన్ని నిర్మించాను..
ప్రేమంటె పడదని,
నన్ను అసహ్యించుకున్నావు..
కన్నీళ్ళను పరిచయం చేసి,
నిశ్శబ్దంగ మనసులో నిలిచున్నావు..
అయినా సమ్మతమే.....


కానీ...............
నేను ఎదురైనప్పుడన్నా...
 ఓ చిన్ని నవ్వుని దానమియ్యొచ్చుగా.?
ఓ మాటైన ముఖాన పరచచ్చుగా.?
ఓ కను చూపుని పడవేయొచ్చుగా.?
నా పాదాలకు ఒక్క అడుగుని జత చేయొచ్చుగ.?

ఎందుకంత ద్వేషం..
ఎందుకంత కోపం..
నిన్ను ప్రేమించాననా.?
నిన్ను ఆరాధించాననా.?
ఎందుకనీ....

2, ఆగస్టు 2011, మంగళవారం

ఎంత చిత్రం..

ఆమె నడకను చూసి,
నా మనసు నడకలు నేర్చుకొని తన వెంటే నడుస్తుంది..

ఆమె ప్రేను అంభవించి,
నా జీవితం ప్రేమను తెలుసుకొని తన ప్రేమలో కలిసిపోయిఉంది..

ఆమె మాటలు విని,
నా మౌనం మాటలు నేర్చుకొని ఆమె మాటల్లోనె అంతమయ్యింది..

ఆమె సౌందర్యం చూసి,
నా భావం సింగారించుకొని ఆమె సౌందర్యంగ సాగిపోతుంది..

ఎంత చిత్రం..
ఆమంటే నాకెంత ఆత్రం..
కావాలి తను నా కళత్రం..
పంచాలి ప్రేమ నిత్యం..

తనదే...


ప్రేమా..!!
నీకు ఎన్నో మనసులు పరిచయమయ్యాయి కావచ్చు,
కానీ నాకు పరిచయమైన  ఒకే  ఒక్క  మనసు తనదే....

సంతోషమా..!!
ఎన్నో పెదవులు నిన్ను తాకి ఉంటాయీ,
కానీ నా పెదవులను తాకిన ఒకే ఒక్క సంతోషం తనిచ్చిందే....

స్వప్నమా..!!
నీకు ఎన్నో కన్నులు వరంగ లభించ్వ్హాయి కావచ్చు,
కానీ నా కనులను తాకిన ఒకె ఒక్క స్వప్నం తనదే....

భావమా..!!
ఎన్నో ఆలోచనలు నిన్ను ఆశ్రయించి ఉండొచ్చు,
కానీ నన్ను ఆశ్రయించిన ఒకే ఒక్క ఆలోచన తనదే....

నా హృదయం ఎప్పటికి కోరుకునే ఒకే ఒక్క
                                              చెలి తనే..
                                               ప్రేమ   తనదే..
                                              భావం  తనదే..
                                           మనసు   తనదే..
                                                         తనదే..
                                                         తనదే..
                                                         తనదే..
                                                         తనదే..

నీ ప్రేమలేక ....

నీ నడకలో ధ్వనించు కాలి గజ్జెల సంగీతానికి,
నేను ప్రణయ గీతాలు ఆలాపిస్తున్నానూ...

ప్రకాశించు నీ మోము కాంతుల్లో,
నా భవిష్యత్తు బాటను చూసుకుంటున్నానూ...

నీ పెదాలపై పూయు చిరునవ్వుల మొక్కలతో,
నా ఆరోగ్యావసర ఔషధ గుళికలు తయారుచేసుకుంటున్నానూ...

నా నుండి దూరమయ్యే నీ నడకలతో,
నా గమ్యానికై అడుగులను నేర్చుకుంటున్నానూ...

నన్ను నిందించే నీ మాటలను ఏరి,
నా హృదయ  స్పందనగ మార్చుకుంటున్నానూ...

ప్రియా..!!!
వసంతంలేక కోయిల ఉంటుంది..
నీరులేక నది ఆనవాళ్ళు ఉంటాయి..
సూర్యుడులేక సగం దివసం ప్రపంచముంటుంది.
కానీ...
నీ ప్రేమలేక నేను
క్షణం..
ఒక్క క్షణం..
అయిన జీవించలేనూ...
మనుగడ సాగించలేనూ...

నా వల్ల

ప్రాణవాయువు ఆగిన నాడు ఈ జగమే శూన్యం,
నాలో ప్రేమనేది లేని నాడు మరణమే శరణ్యం,

బాధలో కూడ సంతోషాలకై,,
నిన్ను, నీ జ్ఞాపకాల్ని  తలుచుకుంటా..

పెదాలపై చిరునవ్వు కోసం,,
నీ పేరును పిలుచుకుంటా...

గుండె బరువును దించుకొనుటకై,
ఏవో రాతలు రాసుకుంటా...

నిత్యం నీ నామస్మరణ చేసే ఈ పూజారికన్న,
వినే దేవతవైన నీకె బాధెక్కువన్నావూ...
చెలీ...
నా వల్ల నీకు క్లేశమైతే,
నా వల్ల నీకు ఖేదమైతే,
ఆపుకుంటా నా గుండె సవ్వడిని..
తీర్చుకుంటా నా మనోవ్యధని..


ఎందుకంటే....
 నీకు ,
ఒక్క కన్నీటి చుక్క నేల రాలకూడదూ..
ఒక్క క్షణం కూడా మనసు చింతించకూడదూ.. 
ఒక్క క్షణం కూడా మనసు చింతించకూడదూ.. 

ప్రేమ అనె పదం వినగానె


ప్రేమ అనె పదం వినగానె,
అద్దంలాంటి నా మనసు వేదనలతో బద్ధలవుతుంది,
అనురాగంతో చూడు సఖీ..
ప్రతి ముక్కలోను నీ రూపే నిలిచి ఉంటుంది...

ప్రేమ అనె పదం వినగానె,
మంచులాంటి మనసు వెతలతో కన్నీరుగ కకరుగుతుంది,
ఆప్యాయతతో చూడు ప్రియా..
ప్రతి కన్నీటి బొట్టులో నీ ప్రేమె నిండి ఉంటుంది...

సంతోషాల మాల..


నిన్నటి రోజు కరిగి పోయిన కల..
రేపు చేరబోయె అల..
మనరోజే ఇవ్వాళ్ళ..
విసురు చిరునవ్వులకై వల..
ఆనందంగ ఉండు అన్ని వేళల..
దరియించు సంతోషాల మాల..
చేసుకో నీ జీవితం మోద శాల..
బ్రతుకు ఆరిపోతున్న జ్వాల..
తొలిగించు హ్రుదయంలో మైల..
ఇక దుఖము ఏలా.?..

రోజు


ఈరోజు..
ఈ రాజు..
ప్రేమ అంతంచెంది,
ఆ రాజు పంతం వదిలి,
ఈ రాజును స్వంతంచేసుకోబోతున్న రోజు....
నా ఆలోచన ఆప్తులూ..
నా అనవరత ఆర్తనాదాలూ..
నా ఆశయాల ఆస్తులూ..
నా అజస్ర అస్రములూ..
నా అవిరత ఆలోడనములూ..
నా ఆలోక ఆనందములూ..
నా అవిరళ ఆవేదనములూ..
పరిసమాప్తియై,
పరలోకానికి ప్రయాణమయ్యే పర్వదినం..
ఆసయము ఆరిపోయి సోక సంద్రం సాగే సమయం..
ఆత్మ కాయమును అవిముక్తం చేసి,
అందరికి ఎడబాటయ్యే రోజు,
జీవతానికి అవధి రోజూ..
ప్రేమకి సమాధి రోజూ..

ఆశావిహంగాలూ.....


ప్రియా..!!!!
వేగంగ వీచే గాలికి మొక్క వంగినట్లు,
నీ ప్రేమ గాలికి నా మనసు కుంగిపోతుంది..

ప్రతి చినుకు చినుకు కలిసి ధారగ ప్రవహించినట్లు,
ఒక్కొక్క బాధకలిసి కన్నీటి వెల్లువై నా గుండేల్లోంచి ప్రవహిస్తుంది..

కనబడలేదా.??  
నా లోకమా..!!!
నీ చేతి స్వర్శకై ఎదురుచూసె ఆ భాస్పధారల జాడలూ.....

వినిపించలేదా.??
నా ఆయువా..!!!
ప్రతి క్షణం శబ్దించె నా హ్రుదయస్పందనగ మారిన వెతలూ.....

అగుపించలేదా.??
నా ప్రాణమా..!!!
నీ కోసమె ఆలోచిస్తు కోరితెచ్చుకుంటున్న ముఖంలోని మౌనరేఖలూ.....
వేరే చెట్టుకై అన్వేషిస్తు రెక్కలోచ్చి ఎగిరిపోయిన నా ఆశావిహంగాలూ.....
నీ దర్శన భాగ్యం వల్ల ఆనందిస్తున్న ,
కన్నీళ్ళకు నిలయమైన నా నయనాలు.....
నీ మాటలు వింటున్నంతసేపు అప్పటి కొరకు దరహాసమును అప్పుతెచ్చుకుంటున్న నా పెదాలూ.....

చేరదియ్యలేవా.??
నా సర్వస్వమా..!!!
నీ ప్రేమకై తపించిపోతున్న ,
నీ జతకై ఆరాటపడిపోతున్న,
అనాథలైన ...
              నా మనసునీ.....
              నా వయసునీ.....
              నా స్నేహమా..!!!
              నా శాపమా..!!!
              నా మరణమా..!!!!!!!!!

1, ఆగస్టు 2011, సోమవారం

కనులు తెరిస్తే.. మూస్తే...

కనులు తెరిస్తె తన రూపం ప్రతిపూట, ప్రతిచోట ప్రత్యక్షమై
నన్ను,నా ఒంటరితనాన్ని
గుర్తుకుతెస్తు, బాధిస్తు తను హాయిగ చలిస్తు ఉంటుంది...
కనులు మూస్తె ఆలోచనై కలై వచ్చి తన ఙ్నాపకాలను ఇస్తు,
నా దురద్రుస్టాన్ని స్మరనకు తెస్తు దు:ఖింపజేస్తుంది..
ఎందుకో నాకు ఇంత ఖేదం ..
నన్ను తనల మార్చాలనొ?
త్వరగ కడతేర్చాలనో?
చెలి లేని లోకంలోకి చేర్చాలనో?????
ఎందుకో?????
మరెందుకో?????????

కమలిని..

తపించిపోతున్న తీరానికి నీటిని అందించిన అలల,
గుండెలోని భావాలకు అక్షరాలను అందించిన హ్రాదని.....
నిర్మలం చేసింది నా హ్రుదిని....

మోడై బోసిపోతున్న హ్రుక్షానైకి పుష్పాలను అలంకరించిన గ్రీష్మంల,
రాత్రిలో నిస్సారంగ సాగుతున్న కనులకు కమనీయ కలలను ప్రసాదించిన కమలిని..
రంగులమయం చేసింది నా జ్జీవతాన్ని..


అంధకారంలో అలమటిస్తున్న రాత్రికి వెన్నెల సోభను కలిగించిన పున్నమిలా,
మోడైన నా పెదాలకు నవ్వుల్ని అందించిన పార్వతి..
అందంగ మార్చింది నా మోముని............   

కవితా ఓ కవితా....

మాటల్లొ పొంగగ పుప్పొడులు,
తీర్చావు గుండెల్లోని అలజడులు,
అనంత ఆలోచనలు కలిగించిన,
అంతులేని ఆనందాలు అందించిన,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,

రప్పించి ఙ్నానమబ్బులు,
కురిపించి భావ జల్లులు,
అణువణువు అక్షర కుసుమాలు పూయించిన,
ఎన్నో కావ్యమాలలు అల్లించిన,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,

కర్షకుల చెమటలో నిండి,,
భావుకుల విరహాలతో మండి,,
దింగంబరుల దిగులును పిండి,,
స్త్రీవాదుల చింతలతో ఉండి,,
నయగారుల నాట్యాలతో సాంప్రదాయ సాహిత్యానికి పెట్టి గండి,,
దలిత కవుల దండోరగ మారి,,
నవ్య కవిత్వం స్రుష్టించిన,,
ప్రక్రుతి సమస్తం స్రుజించిన,,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,


నిర్మించి మహా కావ్యాలు,
పండించి పుష్కల పురాణాలు,
అందించి అద్భుత ఐతిహ్యాలు,
సాహిత్యలోకం సుసంపన్నం చేసినా,
ప్రతి అంగుళం పరిమలం నింపినా,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,


ఎందరికో ఇప్పించి డాక్టరేట్లు,
ఎందరికో తెప్పించి ఙ్నానపీఠాలు,
ఎందరికో  చూపించి సన్మార్గాలు,
ఉన్నత స్థానాలు ఇచ్చినా,,
కీర్తితో స్నానాలు చేయించినా,,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,,,,
          ప్రసాదించు చక్కని భవితా,,,,,,,,,,,
   

ఓ కవిత్వం....

బాధ ఆశ్రయించిన వేళ,
రోధ వెల్లువిరిసిన వేళ,
మనస్సే మౌనమైన వేళ,
శిరస్సే ఆలోచనైన వేళ,
హ్రుదయం ఉప్పొంగె వేళ,
ఉదయాన ధుఖించిన వేళ,
ప్రక్రుతి ఆహ్లాదించిన వేళ,
నయనం ఆశ్రువైన వేళ,
పయనం ఒంటరైన వేళ,
సంతోషం నేనైన వేళ,
పారితోషికం అనుభూతైన వేళ,
కాలం కరునించని వేళ,
గాలం ఓ సంఘటైన వేళ,
మౌనం కొలువైన వేళ,
ప్రాణం  అల్లాడుతున్న వేళ,,,,


"""నాలోని భావాలు,
నాలోని ఆలోచనలు,
అక్షరరూపమై,
నా సర్వాస్వాన్ని,
తనుగా మార్చుకొని,
కాగితంపై కొలువుంటాయి..
కన్నీటి బిందువులుగా తీర్చబడుతాయి.."""

నిజమైన నేస్తాలు...

ప్రేమలే కరువైన వేళ,
ఆప్యాయతలే అందని
బంధాలే తెగిన
గుండె బరువైన
మనసు చెదిరిన
హాస్యాలే కన్నీటిని తెప్పిస్తాయి..
కూలర్లే చెమటను పుట్టిస్తాయి..
ఆప్యాయతలే ద్వేషాల్ని పంచుతాయి..
మౌనాలే బాధల్ని వ్యక్తపరుస్తాయి.
బాధలే ఓదార్పునిస్తాయి..
ఆలోచనలే హ్రుదయ స్పందనను ఆపుతాయి..
స్మశానాలే ఆశ్రయాలవుతాయి..
కట్టెలే సహచరులవుతాయి.

నా గమ్యం..

ప్రతిక్షణం విఙ్ఞానం కోసమై,,
ప్రతి అడుగు గమ్యం కోసమై..
ఇష్టంతో కష్టంగ శ్రమిస్తా,
ఏనాటికైన నేననుకున్నది సాధిస్తా..

నేను కాదు ప్రతిభావంతున్ని,,,
                 ధనవంతున్ని...
శ్రమతో నేను ప్రతిభావంతున్నై,,
ప్రతిభే నాకు ధనమై,
ప్రతిభతో ప్రయత్నిస్తా,
ఫలాన్ని ఆకాంక్షిస్తా...

సాధిస్తే గౌరవం,
లేదంతే అవమానం,
అణుక్షనం ఆరాటం,
గమ్యం కోసమే పోరాటం..


కస్టాలతో ప్రయాణం చేసి సుఖాల్ని చేరుకుట..
అఙ్ఞానంతో చెలిమిని చేస్తూ కూడ విఙ్ఞానాన్ని సంపాదిస్తా..
దురద్రుస్టంతో బ్రతుకుతు అద్రుస్టనిధిని సాధిస్తా..
స్వప్నాలతో శయనించి మెల్లుకువలో నిజాలుగ మారుస్తా..
దుఖపు కన్నీల్లను ఆనంద భాష్పాలుగ ఆవిష్కరిస్తా..

ఆలోచనే ఆయుధంగ అక్షరాక్షరం శోదిస్తా,
ఆలోచనల్ని కవిత్వం చేసి నా భావాల్ని వివరిస్తా,
బ్రతుకులో మరనిస్తా,
మరనించి కూడా జీవిస్తా.
ఏనాటికైన నేననుకున్నది సాధిస్తా.
దాని కోసమే ప్రతి క్షనం శ్రమిస్తా....
దాని కోసమే ప్రతి క్షనం శ్రమిస్తా....
 నా గమ్యం..

బ్రతుకు..చావు..

ప్రేమా బంధమా..!!!!!
జీవంచడానికి జీవతమూ ఉంది,
చచ్చేందుకు మరణమూ ఉంది,
కాని బ్రతుకు, చావుల మధ్య సంతోషంగ ఉండేందుకు,
నీ ప్రేమ  లేదే నాకు...

చిన్న చిన్న సంతోషాలున్నాయి,
దుఖాన్ని పారించే బాధలూ ఉన్నాయి,
కాని బాధల్ని కూడా సంతోషాలుగ మార్చేందుక్,
నీ అనురాగం  లేదే నాకు..

నిద్రనిండ కలులున్నాయి,
మెలుకువలో నిజాలూ ఉన్నాయి,
కాని కలల్ని కూడా నిజాలుగ చేసెందుకు,
నీ తోడు లేదే నాకు...

నా బ్రతుక్కు ఆరోగ్యము ఉంది,
అనారోగ్యమూ ఉంది,
అనారోగ్యాన్ని ఆరోగ్యంగ మార్చేందుకు,
నీ సాహచర్యం లేదే నాకు...

నాకు దుఖపు కన్నీల్లున్నయి,
ఆనంద భాష్పాలూ ఉన్నాయి,
కాని కన్నీల్లను పన్నీరుగ మార్చేందుకు,
నీతో గడుపిన తీపి ఙ్ఞాపకాలు లేవే నాకు...

అంతంవైపు....

ఆశల్ని మూటగట్టుకోని,
ఆనందాన్ని ఆప్తులకిచుకొని,
ఙ్ఞాపకాల్ని గాయాలుగ చేసుకొని,
ఆప్యాయతలు తెంచుకొని,
ప్రేమను మనసత నింపుకొని,
సాగుతుంది ప్రయాణం..
               మ్రుతివైపూ,,
               చితివైపూ,.
               కలతల,
               కస్టాల,
               కన్నీల,
                అంతం వైపూ......