నిశ్శబ్దపు ప్రాంగణంలో ఉన్న,
నావైపు తను నడుస్తూ వస్తుంటే,
ఘల్లు ఘల్లు ఘల్లుమన్న కాలి గజ్జెల సవ్వడి,
గతించిన నా గుండె సవ్వడిని,
ధ్వనిగా మార్చుకున్నాదో ఏమో అని అనిపిస్తుంది..
ఎడబాటు నుండి ఎదవైపుకు తను కదిలివస్తుంటే,
మాసిపోయిన నా మౌనాలన్నింటిని మాటలుగా మలిచి,
కర్ణబేరుల్ని మోగించడానికి వస్తున్నదో అన్నట్టుంది.
తను కళ్ళెత్తి చూస్తె పడే ఆ చూపుల వర్షం,
నా గుండెల్లో ప్రేమ జల్లులై పడి,
ఆనంద పువ్వుల్ని పూయిస్తాయి.
తను తాకిందంటే ఆ స్పర్శ హర్షమై,
ఆత్మీయ అనురాగాల్ని అణువణువు నిపుతుంది..
ఇక తను నాతో సాగిందంటే,
క్షణమో రసమై,
నిమిషమో అనుభవమై,
జీవితాన్ని ఆకాశంలోని మేఘంలా,
అలుపెరగని ప్రవాహంలా,
ఆటంకంలేని గమనంలా మార్చేస్తుంది..
నిరంతరం నవ్వై,
ప్రేమ పువ్వై,
పరిమళాల్ని పంచుతుంది..
కన్నీరు లేని కావ్యంగా,
నన్ను మారుస్తుంది..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి