ప్రేమంటే..
చంద్రునికి కట్టిన వెన్నేల ఉయ్యాలలో ఊగిసలాడుతు ఇద్దరు ఏకంతాన్ని నిశ్శబ్ధంగ అనుభవించడమే,
ప్రేమంటే..
జంట పక్షులై ప్రక్రుతి కొమ్మపై కూర్చోని కనుచూపులతో మాట్లాడుకోవడమే,
ప్రేమంటే..
క్షణాల్ని వెంటనడుపుకుంటు కాలానికి ఙ్నాపకాల అమ్రుతాన్ని పంచడమే,
ప్రేమంటే..
దు:ఖాల్ని దగ్ధంచేసి సంతోషాల్ని స్వాగతించడమే,
ప్రేమంటే..
గాలి గ్రుహంలో ఉంటూ మౌనాల్ని మాటలుగ మాటలుగ మార్చడమే,
ప్రేమంటే..
కనులను జతగా మార్చి చీకటికి కలల హారాన్ని బహుకరించడమే,
ప్రేమంటే..
బావిలొ మునిగిపోతున్న ఆశల చేపల్ని కోరికల వలలతో బంధించడమే,
ప్రేమంటే..
మానస దేవాలయంలో అనురాగ రూపాన్ని తరగని ఇస్టంతో నెలకొల్పడమే,
ప్రేమంటే..
ప్రకృతంత మమకారాన్ని నింపుకొని భవిష్యత్తును హరివిల్లుగ మార్చుకోవడమే,
ప్రేమంటే..
ద్వైతమైన మనస్సులను అద్వైతం చేసి చివరి వరకు చీకటి, వెలుగులను కలిసి పంచుకోవడమే,,,,,
""""" ప్రేమంటే.....
తరగని నిధి.....
హ్రుదిని శసించే విధి....
దాసోహం ప్రతి మది.....
ప్రేమ కానిది ఏది..... """""
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి