27, జులై 2011, బుధవారం

!!!! కాలంపై సమాధి !!!!


ఏ అనుభవం అందించకుండానే కాలం గతమయ్యింది.
ఒక్క మాటైన మాట్లాడకుండ క్షనం దూరమయ్యింది.
ప్రియా..
నేను బ్రతికున్నందుకు నీ ఆనందలోకంలోకి ఆదరించలేదు.
నాలో నీపై మమకారమున్నందుకు నీ ప్రేమ గ్రామంలో అంటరానివాన్ని చేసావు.
నేను మనసిచ్చినందుకు  నీ మాటల వాడ నుండి వెలివేసావు.
ఓ అందని తీరమా..!!!
 హ్రుదయంలో నువ్వంటించిన విరహకుంపటిని చల్లర్చేందుకు,
కొన్ని సంవత్సరాలుగ కన్నీల్లను చల్లుతూనే ఉన్నాను.
నువ్వు పడేసినా ధుఖపు సంద్రం నుండి తీరాన్ని చేరేందుకు,
కొన్ని యుగాలుగ ఈదుతునే ఉన్నాను.
ఏరి కోరి నిన్ను చేరిన ఆనందానికి కాలంపై సమాధి కట్టావు.
నిన్ను ప్రేమతో పలకరించిన నా మనసుకు ద్వేషంపై చితిని పేర్చావు.
నన్ను ఎండ తగిలే మంచులా మార్చావు.
గాలి తగిలె మబ్బుల మిగిల్చావు............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి