అమ్మా..!!!!
అలసిపోయచ్చిన నేను సేదతీరేందుకు నీ భుజం ఎక్కడమ్మా..??
బాధ పడిపడి కుంగిపోతున్న నన్ను ఓదార్చేందుకు నీ కమ్మని పలుకు ఎక్కడమ్మా.??
వేదనలతో కన్నీరుగ కరిగిపోతున్న నా భాష్పాలను తుడిచే నీ అమ్రుత హస్తం ఎక్కడమ్మా.??
మన:తాపం కలచివేస్తున్నప్పుడు నన్నాదరించె నీ స్వర్గపు ఒడి ఎక్కడమ్మా.??
క్షణ కాలం కనబడకపోతే కన్నా, చిట్టి అని పిలిచే నీ మధుర గానం ఎక్కడమ్మా.??
బాధైనా, సంతొషమైన,
సుఖమైనా,దుఖమైనా చెప్పుకునేందుకు అమ్మా నీ మనసు ఎక్కడమ్మా.??
అమ్మా..అమ్మా.. అని తలచుకొని ఆనందించమని అనంతలోకానికి నువ్వెళ్ళిపోయావు...
అనంత శోకాలను నాకు మిగిల్చి.ఎందుకమ్మా నన్ను వదిలెల్లావు..
నీ వెంట నాన్నూ తీసుకువెళ్ళుంటే నీ ప్రేమను అనుభవించేవన్ని కదా..
అమ్మ తనాన్ని ఆస్వాదించేవన్ని కదా..
అమ్మ పదమే మిగిల్చి నువ్వు దూరమయ్యావు..
నన్ను అనాథను చేసి...
ఓ గాథగ మార్చి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి