ఓ లోకమాతా!!!!
ఒకప్పుడు నువ్వు------
సాంప్రదయపు సంకెళ్ళతో వంటింట్లొ బంధింపబడి మూగబోయిన గ్రుహలక్ష్మివి.!!!
పేదరికపు అంగట్లో ధనవంతులు,రేపో-మాపో రాలిపోయె వ్రుద్దులు కొనుకున్నే పుత్తడిబొమ్మవి.!!!
బాల్య వివహాల బాసికాలతొ చిన్నతనంలోనె ఉరితీయబడ్డ బంగారు భవిషత్తువి.!!!
సతిసహగమన యాగపు మంటల్లొ కాలిపోయిన చిగురించే కొమ్మవి.!!!
కట్టుబాట్ల కాలంలో,
మూఢనమ్మకాల సమయంలో,
స్వేచా విహీనురాలివై,
అస్వతంత్రరాలివై,
అడుగడుగు ఆంక్షల మేకులు గుచ్చుకొని రక్తాశ్రువులను దారపోసిన సహనశీలివి.!!!
ఆచారాల ఆయుధాలతో అంతంచేయబడ్డ దేవతవి.!!!
కష్టాల బాటలో,
కన్నీళ్ళ మూటలతో ప్రయానంచేసినా నీ వారికి ఆనందాన్ని ఒసగే కల్పవల్లివి.!!!
చలం ఆత్మీయ బంధువివి.!!
కందుకూరి పోరాటనివివి.!!!
భావకవుల హ్రుదయేశ్వరిగ ,
ఆరాధ్య దేవతగ కీర్తించబడి,
స్త్రీవాదంలో శిఖరాయమాన స్థానాన్ని పొందిన భాగ్యశీలివి.!!!
చరిత్ర గతుల్నే మార్చేసిన శ్రమజీవివి.!!!
ఇప్పుడూ............
ప్రేమోన్మాధుల చేతుల్లో రాలిపోతున్న సుకుమార పుష్పానివి.!!!
ధనాశగల రాబందుల రెక్కల గాలికి ఆరిపోతున్న దీపానివి.!!!
మదోన్మత్తుల కటినపు కౌగిట్లో గాయపడుతున్న కోమలివి.!!!
ప్రేమకు నిలయానివివి.!!!
త్యాగానికి మరోరూపానివి.!!!
అయినా
ఆనాటికి..
ఈనాటికి..
మారని కథవి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి