5, ఆగస్టు 2011, శుక్రవారం

దూరం..సుదూరం...

చెలి..!!
నీ కనుచూపుల వాకిట్లో
 నా నయనాలు ప్రేమగ వేచి ఉంటాయి చూడు..
నీ ఆనంద  పందిరిపై,
నా ఆశల లతలు వాడిపోయి మిగిలుంటాయి 
చూడు..
నీ గుండె ఆలయంలో,
నా మనస్సు శిథిలమై ఉంటుంది 
చూడు,
నీ కలల సామ్రాజ్యం కింద,
నిద్రించని రాత్రులు సమాధియై ఉంటాయి 
చూడు,
నీ అదృష్ట  గ్రహంపై,
నా దురదృష్టపు స్త్రీకాలి గుర్తులుంటయి 
చూడు,
నీ అడుగుల కింద,
నశించిన నా కన్నీటి క్షణాలుంటాయి 
చూడు ..
నీ సంతోష లోకంలో,
నా ఆనంద బాలికలు ఏడుస్తు ఎదురస్తాయి చూడు..


సఖీ...!!!!
మనిద్దరి మనసులు ఒకటైన వేళ,
గెలుపు,ఓటమి
చావు,బ్రతుకు ఇరువురికి సమానం...
నీ మనస్సు అంగీకరించని నా మనసు వేరైనప్పుడు,
""గెలుపు నీదైతే,
ఓటమి నాదె కదా..
  ఆనందం నీదైతే,
అలజడి నాదే కదా..
ఈలోకం స్వర్గం నీకైతే,
నరకం నాకే కదా..
ఇకపై..........
జీవనం నీకైతే,
నా మనస్సుకు,
నాకు,
మరణమే కదా..
నీ రూపం,

నీ జ్ఞాపకం  దూరమే కదా..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి