ప్రేమా..!!
నీకు ఎన్నో మనసులు పరిచయమయ్యాయి కావచ్చు,
కానీ నాకు పరిచయమైన ఒకే ఒక్క మనసు తనదే....
సంతోషమా..!!
ఎన్నో పెదవులు నిన్ను తాకి ఉంటాయీ,
కానీ నా పెదవులను తాకిన ఒకే ఒక్క సంతోషం తనిచ్చిందే....
స్వప్నమా..!!
నీకు ఎన్నో కన్నులు వరంగ లభించ్వ్హాయి కావచ్చు,
కానీ నా కనులను తాకిన ఒకె ఒక్క స్వప్నం తనదే....
భావమా..!!
ఎన్నో ఆలోచనలు నిన్ను ఆశ్రయించి ఉండొచ్చు,
కానీ నన్ను ఆశ్రయించిన ఒకే ఒక్క ఆలోచన తనదే....
నా హృదయం ఎప్పటికి కోరుకునే ఒకే ఒక్క
చెలి తనే..
ప్రేమ తనదే..
భావం తనదే..
మనసు తనదే..
తనదే..
తనదే..
తనదే..
తనదే..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి