5, ఆగస్టు 2011, శుక్రవారం

దారిగ పరిచి...

నీతో తిరిగిన ప్రతి ప్రదేశం,
నా కాళ్ళను బంధిస్తుంటే,
కదలలేని శిలనై నీకోసమే నిలిచున్నాను..

నీతో కలిసి చూసిన ప్రతి ప్రాంతం ,
నా కళ్ళను కాటేస్తుంటే,
కనుచూపులను దారిగ పరిచి నీకోసమే వేచి ఉన్నా...

నీతో గడిపిన ప్రతిక్షణం,
మనసుపై పూల మొక్కలై మొలుస్తుంటే,
నువ్వులేని క్షణాల్ని పువ్వులుగ పూయించి,
నీకోసమే ఎదురుచూస్తున్నా...

నువ్వు పలికిన ప్రతి పదం,
అనుభవమై నా జీవితాన్ని శాసిస్తుంటే,
మిగిలిన జీవితాన్ని నీకు అంకితమివ్వడానికి ,
నీ కోసమే బ్రతికున్నా...
""ఎండిన మనసుతో,
కాంతిలేని ఉషస్సుతో..""

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి