1, ఆగస్టు 2011, సోమవారం

కవితా ఓ కవితా....

మాటల్లొ పొంగగ పుప్పొడులు,
తీర్చావు గుండెల్లోని అలజడులు,
అనంత ఆలోచనలు కలిగించిన,
అంతులేని ఆనందాలు అందించిన,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,

రప్పించి ఙ్నానమబ్బులు,
కురిపించి భావ జల్లులు,
అణువణువు అక్షర కుసుమాలు పూయించిన,
ఎన్నో కావ్యమాలలు అల్లించిన,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,

కర్షకుల చెమటలో నిండి,,
భావుకుల విరహాలతో మండి,,
దింగంబరుల దిగులును పిండి,,
స్త్రీవాదుల చింతలతో ఉండి,,
నయగారుల నాట్యాలతో సాంప్రదాయ సాహిత్యానికి పెట్టి గండి,,
దలిత కవుల దండోరగ మారి,,
నవ్య కవిత్వం స్రుష్టించిన,,
ప్రక్రుతి సమస్తం స్రుజించిన,,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,


నిర్మించి మహా కావ్యాలు,
పండించి పుష్కల పురాణాలు,
అందించి అద్భుత ఐతిహ్యాలు,
సాహిత్యలోకం సుసంపన్నం చేసినా,
ప్రతి అంగుళం పరిమలం నింపినా,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,


ఎందరికో ఇప్పించి డాక్టరేట్లు,
ఎందరికో తెప్పించి ఙ్నానపీఠాలు,
ఎందరికో  చూపించి సన్మార్గాలు,
ఉన్నత స్థానాలు ఇచ్చినా,,
కీర్తితో స్నానాలు చేయించినా,,
కవితా ఓ కవితా,,,,,
నన్ను దీవించి ప్రసాదించు చక్కని భవితా,,,,,
          ప్రసాదించు చక్కని భవితా,,,,,,,,,,,
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి