కష్టాల మబ్బులు ఆవరించి,
కన్నీళ్ళ ముసురు పట్టింది నా జీవితానికి,
ఆలోచన ఉరుములతోటి,
ఙ్ఞాపకాల పిడుగులు పడుతున్నాయి నా మన్సు మీద..
నీ ఎడబాటుతో..
ఈ క్షణం నిన్ను ప్రేమించవద్దనుకుంటూనే,
ప్రతి క్షణం నీ ద్యాసతో అనుభవమై వెలుగుతుంది..
ఈ నిమిషం నిన్ను గుర్తుకుతెచ్చుకోవద్దనుకుంటూనే,
ప్రతి నిమిషం నీ రూపమై చిరునవ్వుల్ని చిందిస్తుంది..
కాలం వేటకు,
బలైన సంతోషాన్నయ్యాను..
క్షణాల తూటాలకు,
ఆరిపోబోతున్న ఊపిరినవుతానేమో..??
నేను ప్రేమికున్నో..!!
లేక దుఖితున్నో..!! నీ తలపులో...
నేను ఇష్టాన్నో..!!
లేక ద్వేషాన్నో..!! నీ మనసులో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి